ఏదో పనిలో బిజీగా ఉంటాం. అవతలి వారు.. ఏదో.. మెసేజ్ చేస్తారు.. మళ్లీ మనం చూసి ఏం అనుకుంటామోనని వెంటనే డిలిట్ చేస్తారు. ఇక ఆ మెసేజ్ ఏంటో వాళ్లు చెప్పారు. మనం ఎంత ప్రయత్నించిన తెలియదు. కానీ అలా డిలిట్ చేసిన మెసేజ్ లను చూసుకునే ఛాన్స్ ఉంది. ఎలా అంటారా?


మనం చదవడం కంటే.. ముందే.. డిలీట్​ చేసిన మెసేజ్​లను డబ్ల్యూఏఎమ్​ఆర్(WAMR) యాప్​ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ తో వాట్సాప్​లో పెట్టిన స్టేటస్​ల కూడా మనం డౌన్​లోడ్​ చేయోచ్చు. 


ఈ యాప్ డౌన్ లోడ్ కోసం.. గూగుల్​ ప్లేస్టోర్​లోకి వెళ్లాలి. డబ్ల్యూఏఎమ్​ఆర్​ అనే యాప్​ను ఇన్​స్టాల్​ చేయాలి. సంబంధిత సెటప్​లను యాక్సెప్ట్​ చేయాలి. ఏ యాప్ నుంచి మనం డిలీట్​ చేసిన డేటాను పొందాలి అనుకుంటున్నామో వాటిని క్యాప్చర్​ నోటిఫికేషన్​ను యాక్సెప్ట్​ చేసి.. పొందవచ్చు. 


వాట్సాప్​, టెలిగ్రామ్​, ఇన్​స్టాగ్రామ్​ వంటి  సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి డిలీట్​ అయిన సమాచారాన్ని పొందాలనుకుంటే ​​వాటిని సెలెక్ట్​ చేసుకోవాలి అంతే.  ఆ తర్వాత డబ్ల్యూఏఎమ్ఆర్​ యాప్​లో వాట్సాప్​తో పాటు మనం సెలక్ట్ చేసిన అప్లికేషన్ సంబంధించిన డేటాను మేనేజ్​ చేసుకోవచ్చు. డిలీట్​ అయిన మెసేజ్​లు, స్టేటస్​లు డౌన్​లోడ్​ చేయడం లాంటి వాటన్నింటికీ మనకు నోటిఫికేషన్లు చూపిస్తుంది.


వాట్సాప్​, వాట్సాప్​ డిలీటెడ్​ మెసేజులు​, రీడ్​ డిలీటెడ్​ మెసేజులు..  డబ్ల్యూఏఎమ్ఆర్​లో​ చూడొచ్చు. ఒకసారి యాక్సెప్ట్​ చేశాక సంబంధిత నోటిఫికేషన్లు అన్ని డిస్​ప్లేపై వాట్సాప్​ నోటిఫికేషన్ల రూపంలోనే అగుపిస్తాయి.  కావాల్సిన మీడియా ఫైల్స్​, స్టేటస్​ డౌన్​లోడ్​ను ఆటోమేటిక్​గా డౌన్​లోడ్​ చేసుకోవాలనుకుంటే.. దానికి కూడా అప్షన్ ఉంటుంది. ఒక్కసారి పర్మిషన్ ఇచ్చాక డబ్ల్యూఏఎమ్​ఆర్​ వాట్సాప్​ మెసేజ్​లపై లుక్ వేసి ఉంచుతుంది.


ఇంకోలా కూడా చేయోచ్చు..


వేరే యాప్ తో కూడా డిలిట్ చేసిన మెసేజ్ లను చూసేందుకు ఛాన్స్ ఉంది.  ఇందుకోసం మీరు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి whatsremoved+ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసి.. ఇన్స్టాల్ చేసి ఆ తరువాత పర్మిషన్స్ ను ఎనేబుల్ చేసుకోవాలి. ఆ తరువాతే మీరు మెసేజ్ లు చూడగలుగుతారు.


ఏ యాప్ లో డిలిటెడ్ డేటా చూడాలనుకుంటున్నారో ఆ యాప్ లకు పర్మిషన్ ఇవ్వాలి. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్, టెలిగ్రామ్, వాట్స్ ఆప్ వంటివాటిల్లో డిలీట్ అయిపోయిన మెసేజ్ లు మీరు చూడాలంటె ఆ యాప్ లను యాక్సెస్ చేయడానికి whatsremoved+ యాప్ కు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. మీకు ఎలా నోటిఫికేషన్ వస్తుందో.. అలానే.. డిలీట్ అయిన మెసేజ్ లు కూడా whatsremoved+ యాప్ లో సేవ్ అవుతాయి. అవి చూడాలనుకుంటే మీరు whatsremoved+ యాప్ ఓపెన్ చేసి అందులో వాట్సాప్ ను సెలెక్ట్ చేసుకుని చూడాల్సి ఉంటుంది.