వాట్సాప్ పేమెంట్స్ అంటే.. కేవలం లావాదేవీలు చేసి.. సైలెంట్ గా ఉండిపోతాం. కానీ అలా మాత్రమే కాదు.. ఇంకా ఉంది అంటోంది వాట్సాప్. పేమెంట్స్ ఫీచర్ ను కాస్త మార్చేసింది. మనం లావాదేవీలు చేసేప్పుడు... బ్యాక్ గ్రౌండ్ కూడా ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని కల్పించింది వాట్సాప్. ఓన్లీ భారతీయ యూజర్లకు మాత్రమే ఛాన్స్. డబ్బులు పంపే సమయంలో బ్యాక్ గ్రౌండ్ థీమ్ తో మన ఫీలింగ్ ని వ్యక్తపరచవచ్చు. ఎలా అంటే.. గూగుల్ పే పేమెంట్స్ బ్యాక్ గ్రౌండ్ లా ఇది పనిచేస్తుంది. 


వేడుక, ఆత్మీయత, ప్రేమ, సంతోషం.. ఇలా  రకరకాల ఫీలింగ్స్ ను చెల్లింపులు చేసే టైమ్ లో యూజర్లు వ్యక్తపరచవచ్చు. ఉదాహరణకు వినాయకచవితి టైమ్ లో పేమెంట్స్ చేస్తే.. బ్యాక్ గ్రౌండ్ లో వినాయకుడి థీమ్ ని యాడ్ చేసుకోవచ్చు.. రాఖీ రోజు మీ సిస్టర్ కి డబ్బులు పంపితే.. రాఖీతో ఉన్న థీమ్ ని పంపొచ్చు. బర్త్ డే రోజైతే.. కేక్, క్యాండిల్ ఇలా బ్యాక్ గ్రౌండ్ థీమ్ పంపొచ్చన్నమాట. డబ్బులు పంపడం అనేది.. కేవలం లావాదేవీలు మాత్రమే కాదని.. వాట్సాప్ పేమెంట్స్ డైరెక్టర్ మనేశ్ చెప్పారు. ఆ పేమెంట్ల వెనక అనే ఫీలింగ్స్ ఉండొచ్చని అన్నారు. మరింత ఆకర్షణీయంగా పేమెంట్స్ చేసుకునేలా భవిష్యత్ లో కృషి చేస్తామన్నారు.


బ్యాక్‌గ్రౌండ్‌ థీమ్ ఎలా ఛేంజ్ చేయాలంటే..



  • డబ్బులు పంపాలనుకునే వారి కాంటాక్ట్‌ ను సెలెక్ట్‌ చేసుకోవాలి.

  • ఎంత అమౌంట్ పంపిస్తున్నారో ఎంటర్ చేయాలి.

  • బ్యాక్‌గ్రౌండ్‌ అనే ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి.

  • నచ్చిన థీమ్‌ల కోసం స్క్రోల్‌ చేసి సెలెక్ట్‌ చేసుకోవాలి.

  • తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌ ఆప్షన్‌ను డిస్మిస్‌ చేసి చెల్లింపు చేసేయాలి.

  • బ్యాక్‌గ్రౌండ్‌ యాడ్‌ చేసిన తర్వాత కూడా లావాదేవీ మార్చవచ్చు.



వాట్సాప్ పేమెంట్స్‌ను సెట‌ప్ చేయ‌డం ఎలా?



  • స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.

  • టాప్ రైట్ కార్నర్ లో ఉన్న త్రీడాట్స్ మెనూను టాప్ చేయండి.  

  • ఆప్షన్లలో పేమెంట్స్‌ను క్లిక్ చేయండి.

  • ఇప్పుడు యాడ్ పేమెంట్ మెథ‌డ్ ఆప్ష‌న్ టాప్ చేయండి.

  • మీ అకౌంట్ ఉన్న బ్యాంక్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఆ అకౌంట్ మీ మొబైల్ నెంబ‌ర్‌తో లింక‌యి ఉండాలి.

  • వెరిఫై ఎస్ఎంఎస్ బ‌ట‌న్ నొక్కి వెరిఫికేష‌న్ పూర్తి చేయండి.

  • వెరిఫికేష‌న్ పూర్త‌వ‌గానే మీ బ్యాంక్ అకౌంట్‌తో లింకయి ఉన్న అన్ని అకౌంట్ల‌ను చూపిస్తుంది. మీకు కావాల్సిన అకౌంట్‌ను సెట్ చేసుకోండి.

  • డ‌న్ నొక్కితే మీ అకౌంట్ సెట‌ప్ పూర్త‌వుతుంది. 


వాట్సాప్ పేమెంట్ ద్వారా మ‌నీ సెండ్ చేయడం ఎలా? దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి



  • మీరు ఎవ‌రికి మ‌నీ సెండ్ చేయాల‌నుకున్నారో వారితో చాట్ ఓపెన్ చేయండి. 

  • అటాచ్‌మెంట్స్ ఆప్ష‌న్ క్లిక్ చేసి పేమెంట్ ఆప్ష‌న్ టాప్ చేయండి.

  • ఆ కాంటాక్ట్‌లో ఉన్న‌వ్య‌క్తి వాట్సాప్ పేమెంట్స్ సెట‌ప్ చేసుకున్నారో లేదో చూపిస్తుంది.

  • సెండ్ లేదా రిసీవ్ మ‌నీ అనే స్క్రీన్ వ‌స్తుంది.

  • ఇప్పుడు అమౌంట్ టైప్ చేసి ఓకే నొక్కండి.

  • యూపీఐ పేజీలోకి తీసుకెళుతుంది. మీ యూపీఐ పిన్ ఎంట‌ర్ చేయండి. యూపీఐ పిన్ లేక‌పోతే క్రియేట్ చేసుకోండి.
    యూపీఐ పిన్ ఎంట‌ర్ చేయ‌గానే మీ పేమెంట్ పూర్త‌వుతుంది. 
    మ‌నీ రిసీవ్ చేసుకోవాలంటే

  • రిక్వెస్ట్ మ‌నీని క్లిక్ చేయండి. అవ‌తలి వ్య‌క్తి దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీకు మ‌నీ వ‌స్తుంది.


రెండో ప‌ద్ధ‌తి  



  • వాట్సాప్ ఓపెన్ చేసి త్రీడాట్స్ మెనూలోకి వెళ్లండి.  వాట్సాప్ పేమెంట్స్ ఆప్ష‌న్ క్లిక్ చేయండి.  

  • మీ పేరు త‌ర్వాత ఉన్న క్యూఆర్ కోడ్‌ను టాప్ చేయండి

  • దీనితో మీరు ఎవ‌రికైనా వాట్సాప్‌లో మ‌నీ సెండ్ చేయాల‌నుకుంటే చేయొచ్చు.  


 


Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?