WhatsApp Support: మెసేజింగ్ యాప్ WhatsApp అక్టోబర్ 24వ తేదీ నుంచి శాంసంగ్, యాపిల్, సోనీలతో సహా 25 స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయడం ఆగిపోతుంది. కంపెనీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌లను అందించాలని అనుకుంటోంది. అందుకే కంపెనీ పాత ఆపరేటింగ్ సిస్టం నుంచి దాని సపోర్ట్‌ను మెల్లగా తొలగిస్తోంది.


అక్టోబరు 24వ తేదీ తర్వాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వెర్షన్ 4.1, అంతకంటే పాత వెర్షన్‌పైనే పని చేస్తున్న కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు వాట్సాప్ సపోర్ట్‌ను నిలిపివేస్తుంది. మీరు వాట్సాప్‌ను నిరంతరాయంగా ఉపయోగించాలి అనుకుంటే, ఈ కింద ఉన్న లిస్ట్‌లో మీ ఫోన్ ఉంటే... మీరు వెంటనే దాన్ని మార్చాలి. WhatsAppని లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఫోన్‌లో ఉపయోగించాలి.


వాట్సాప్ పనిచేయని ఫోన్లు ఇవే!
శాంసంగ్ గెలాక్సీ ఎస్2
నెక్సస్ 7
ఐఫోన్ 5
ఐఫోన్ 5సీ
ఆర్కోస్ 53 ప్లాటినం
గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జెడ్‌టీఈ
గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జెడ్‌టీఈ
హెచ్‌టీసీ డిజైర్ 500
హువావే ఎసెండ్ డీ
హువావే ఎసెండ్ డీ1
హెచ్‌టీసీ వన్
సోనీ ఎక్స్‌పీరియా జెడ్
ఎల్జీ ఆప్టిమస్ జీ ప్రో
శాంసంగ్ గెలాక్సీ నెక్సస్
ఎల్జీ ఆప్టిమస్ జీ ప్రో
శాంసంగ్ గెలాక్సీ 
హెచ్‌టీసీ సెన్సేషన్
మోటొరోలా డ్రాయిడ్ రేజర్
సోనీ ఎక్స్‌పీరియా ఎస్2
మోటొరోలా క్సూమ్
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ 10.1
అసుస్ ఈఈఈ ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్
ఏసర్ ఐకానియా ట్యాబ్ ఏ5003
శాంసంగ్ గెలాక్సీ ఎస్
హెచ్‌టీసీ డిజైర్ హెచ్‌డీ
ఎల్జీ ఆప్టిమస్ 2ఎక్స్
సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఆర్క్3


వాట్సాప్ సలహా ఇదే!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఉపయోగించే వారికి మెటా నోటిఫికేషన్‌ను కూడా పంపుతోంది. మీరు అప్‌గ్రేడ్ చేసుకోకపోతే, అక్టోబర్ 24వ తేదీ తర్వాత వాట్సాప్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు మీ ఫోన్‌కు రావు. అలాగే మీరు సులభంగా హ్యాకర్ల టార్గెట్‌గా మారవచ్చు. అందువల్ల మీరు మొబైల్‌ను అప్‌గ్రేడ్ చేయడం మంచిది.


ఈ మోడళ్లలో చాలా వరకు చాలా పాతవి, నేడు చాలా తక్కువ మంది మాత్రమే వీటిని ఉపయోగించడం ఉపశమనం కలిగించే విషయం. మీరు ఈ మోడళ్లలో దేనినైనా ఉపయోగిస్తున్నట్లయితే, ఇప్పుడు కొత్త మోడల్‌కు మారే సమయం ఆసన్నమైంది. 


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial