WhatsApp Protect IP Address in Calls: కాలింగ్ సమయంలో మీ లొకేషన్‌ను దాచడంలో సహాయపడే కొత్త ఫీచర్‌ని వాట్సాప్ వినియోగదారులకు అందించింది. ఈ ఫీచర్ పేరు 'Protect IP Address in Call'. మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లడం ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు.


ప్రస్తుతానికి వాట్సాప్ కాల్స్ 'పీర్ టు పీర్ డైరెక్ట్ కనెక్షన్' ద్వారా పనిచేస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో స్కామర్లు లేదా హ్యాకర్లు ఐపీ అడ్రస్ ద్వారా మీ లొకేషన్‌ను కనుగొనవచ్చు. హ్యాకర్లు కూడా ఐపీ అడ్రస్ సహాయంతో మీ సెర్చ్ హిస్టరీ, షాపింగ్ మొదలైన వాటి గురించి సమాచారాన్ని సేకరించవచ్చు. కానీ కొత్త ఫీచర్ తర్వాత మీ వాట్సాప్ కాల్ కంపెనీ సర్వర్ ద్వారా అవతలి వ్యక్తికి చేరుతుంది. ఇది మీ లొకేషన్‌ను హైడ్ చేస్తుంది. మీ ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించలేరు.


కొత్త ఫీచర్‌ని ఇలా ఆన్ చేయండి
'Protect IP Address in Call' ఫీచర్‌ని ఆన్ చేయడానికి మీరు ముందుగా వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌కి వెళ్లి ప్రైవసీలో అడ్వాన్స్‌డ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ నుంచి మీరు ఈ ఆప్షన్‌ను ఆన్ చేయవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే... ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత వాట్సాప్ కాల్స్ ఆలస్యం కావచ్చు లేదా కాల్ క్వాలిటీ ప్రభావితం కావచ్చు.


ఈ కొత్త ఫీచర్‌ని ఆన్‌లో ఉంచిన తర్వాత కూడా మీ కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయి. అంటే కంపెనీ మీరు మాట్లాడుకునేది వినదన్న మాట. కొంత కాలం క్రితం కంపెనీ 'సైలెన్స్ అన్‌నోన్ కాల్స్' అనే ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ఆన్‌లో ఉన్నప్పుడు తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ ఆటోమేటిక్‌గా మ్యూట్ అవుతాయి. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కలగదు. అయితే కాల్స్ ట్యాబ్‌లో ఎప్పుడైనా సైలెన్స్ అయిన కాల్స్‌ను వీక్షించవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో కంపెనీ మిమ్మల్ని మోసాల నుంచి కూడా రక్షిస్తుంది.


మరోవైపు వాట్సాప్ భారతదేశంలో 71 లక్షలకు పైగా ఖాతాలను బ్యాన్ చేసింది. ఏ దేశంలోనైనా ఒకేసారి ఇన్ని అకౌంట్లను వాట్సాప్ నిషేధించడం ఇదే తొలిసారి. భారతదేశంలో వాట్సాప్‌కు 50 కోట్ల మంది వరకు వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ తెలుపుతున్న దాని ప్రకారం కంపెనీ కంప్లయన్స్ రిపోర్ట్ నివేదిక ఆధారంగా ఈ నిషేధాన్ని విధించింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధమైన కొన్ని కార్యకలాపాలు ఈ అకౌంట్లలో కనిపించాయి. ఇంతకు ముందు కూడా వాట్సాప్ భారతదేశంతో సహా ఇతర దేశాలలో అనేక ఖాతాలను నిషేధించింది.


భారతదేశంలో 50 కోట్లకు పైగా వినియోగదారులతో వాట్సాప్ అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌గా నిలిచింది. సెప్టెంబరులో భారతదేశంలో వాట్సాప్ రికార్డు స్థాయిలో 10,442 ఫిర్యాదులను అందుకుంది. వీటిలో 85 ఫిర్యాదులపై చర్య తీసుకున్నారు. అంటే ఈ ఖాతాలను బ్యాన్ లేదా రీస్టోర్ చేశారన్న మాట.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?