WhatsApp Ban Countries: ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ మూడు బిలియన్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే 53 కోట్ల మంది దీనిని వ్యక్తిగత, వృత్తిపరమైన పనుల కోసం ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌కు ఉన్న పాపులారిటీ ఏ యాప్‌కు రాలేదు. ప్రపంచంలోని ఆరు పెద్ద దేశాల ప్రభుత్వాలు తమ దేశాల్లో వాట్సాప్‌ను నిషేధించాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో భారత్ పొరుగు దేశం చైనా కూడా ఉంది.
చైనా మాత్రమే కాకుండా ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, సిరియా, ఉత్తర కొరియా కూడా ఉన్నాయి. ఈ దేశాలు తమ దేశాల్లో వాట్సాప్ వాడకాన్ని నిషేధించాయి. దీని వెనుక కారణం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ఈ దేశాలు వాట్సాప్‌ను ఎందుకు నిషేధించాయో తెలుసుకుందాం.
ఉత్తర కొరియా: ఉత్తర కొరియా ప్రపంచంలో చెడు, హింసాత్మక విధానాలకు ప్రసిద్ధి చెందింది. కిమ్ అక్కడ అనేక రకాల వింత నిర్ణయాలు తీసుకుంటాడు. దీని కారణంగా ప్రపంచంలో అత్యంత కఠినమైన ఇంటర్నెట్ విధానాలు ఉత్తర కొరియాలో ఉన్నాయి. ఉత్తర కొరియాలో సాధారణ ప్రజలకు గ్లోబల్ ఇంటర్నెట్‌కు చాలా పరిమిత యాక్సెస్ అందించారు. ఇక్కడ ప్రభుత్వం కమ్యూనికేషన్‌పై నియంత్రణను కూడా కొనసాగించింది. దీని కారణంగా వాట్సాప్ వంటి యాప్స్‌ను కూడా నిషేధించారు.
చైనా: భారత్ పొరుగు దేశం చైనా పరిస్థితి కొంతవరకు ఉత్తర కొరియాలానే ఉంది. ఇక్కడ కూడా ఇంటర్నెట్‌పై ప్రభుత్వం పూర్తి నియంత్రణను కలిగి ఉంది. చైనీస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని గ్రేట్ ఫైర్‌వాల్... చైనా పౌరులు బయటి ప్రపంచానికి సంబంధించిన అనేక విదేశీ యాప్‌లు, వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది. విదేశీ యాప్‌లకు బదులుగా ‘వుయ్‌ఛాట్’ వంటి స్వదేశీ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం సమగ్ర వ్యూహంపై పనిచేస్తుంది. వాట్సాప్‌ను నిషేధించడం, కమ్యూనికేషన్‌ను నియంత్రించడం ఇందులో భాగమే.
సిరియా: వాట్సాప్‌ను సిరియాలోనూ నిషేధించారు. సిరియా చాలా కాలంగా అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. పైగా సిరియాపై అనేక ఆంక్షలు కూడా విధించారు. దీని కారణంగా సిరియాలో వాట్సాప్‌ను నిషేధించారు. దేశంలో జరిగే విషయాలు బయటికి చేరడం ఇక్కడి ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. అదే సమయంలో వాట్సాప్ నిషేధం కూడా ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ విధానంలో ఒక భాగం.
ఇరాన్: ఇరాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. అణుబాంబు విషయంలో ఇరాన్, అమెరికాల మధ్య వివాదం నడుస్తోంది. దీని కారణంగా వాట్సాప్ ఇరాన్‌లో ఎప్పటికప్పుడు ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది మాత్రమే కాకుండా రాజకీయ అశాంతి దృష్ట్యా కమ్యూనికేషన్, సమాచార వ్యాప్తిని నియంత్రించడానికి అక్కడి ప్రభుత్వం వాట్సాప్‌ను కూడా నిషేధించింది.
ఖతార్: ఈ దేశంలో వాట్సాప్ పూర్తిగా బ్యాన్ అవ్వలేదు. తమ పౌరుల కోసం వాట్సాప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లను మాత్రం ఖతార్ ప్రభుత్వం బ్లాక్ చేసింది. కానీ టెక్స్ట్ మెసేజింగ్ మాత్రం ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఖతార్ ప్రభుత్వం తన టెలికాం కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి కాల్స్‌పై నిషేధం విధించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ): యూఏఈలో ఇటీవలి కాలంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా ఖతార్ ప్రభుత్వం లాగానే వాట్సాప్ వాయిస్ మరియు వీడియో కాలింగ్ సౌకర్యాలను బ్లాక్ చేసింది. యూఏఈలో టెక్స్ట్ మెసేజింగ్ సౌకర్యంపై ఎలాంటి నిషేధం లేదు.
Also Read: మాంచి కెమెరా ఫోన్ కావాలా? ఇవిగో ఈ ఫోన్లు ట్రై చెయ్యండి.. రూ.30 వేలకే అదిరిపోయే ఆప్షన్స్