Best Camera Phones under ₹30,000: రూ.30 వేల కంటే త‌క్కువ బ‌డ్జెట్. మంచి ఫీచ‌ర్స్ ఉన్న ఫోన్, క్వాలిటీ కెమెరా ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే  మార్కెట్ లోకి ఈ నెలలో చాలానే ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఈ మ‌ధ్య సెల్ ఫోన్ కంపెనీలు పోటీలు ప‌డి మ‌రి మంచి క్వాలిటీ కెమెరా ఉన్న ఫోన్ల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. అది కూడా త‌క్కువ ధ‌ర‌లో. కార‌ణం.. ఈ మ‌ధ్య‌కాలంలో ప్ర‌తి ఒక్క‌రు కెమెరా క్వాలిటీకి ప్రిఫ‌రెన్స్ ఇస్తున్నారు. మ‌రి ఆ ఫోన్లు ఏంటి?  వాటి ఫీచ‌ర్స్ ఏంటి? ఒక‌సారి చూద్దామా? 


రియ‌ల్ మీ 12 ప్రో +:


రియ‌ల్ మీ కెమెరా క్వాలిటీకి పెట్టింది పేరు. మంచి క్వాలిటీతో వ‌స్తాయి ఫొటోస్. రియ‌ల్ మీ 12ప్రో + పేరుతో కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. ట్రిపుల్ క‌మెరాతో వ‌స్తుంది ఈ ఫోన్. అంతేకాదు 32 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక బ్యాక్ కెమెరా వ‌చ్చేస‌రికి 4MP OV64B Periscope Telephoto lens, 50MP Sony IMX890 primary sensor, 8MP ulta-wide angle lensతో వ‌స్తుంది. 


ఫీచ‌ర్స్ విష‌యానికొస్తే.. 5జీ, 6.7 ఇంచ్ OLED స్క్రీన్, 93 శాతం రిజ‌ల్యూష‌న్, ప‌వ‌ర్ ఫుల్ క్వాల్క‌మ్ స్నాప్ డ్రాగ‌న్ 7ఎస్ సెకెండ్ జ‌న‌రేష‌న్ చిప్ సెట్‌తో వ‌స్తుంది. 


టెక్నో కామ‌న్ 30: 


ఈ ఫోన్ ప్రైజ్ వ‌చ్చేసి రూ.2,999... 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో మంచి కెమెరా క్వాలిటీతో వ‌స్తుంది ఈ ఫోన్. డ్యుయెల్ కెమెరా సెట‌ప్. 50 మెగా పిక్సెల్ తో వ‌స్తుంది. ఈ ఫోన్ లో డ్యూయెల్ డాల్బీ స్పీక‌ర్స్ ఉన్నాయి. డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెంట్. 5,000mAh బ్యాట‌రీ, 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జ‌ర్ తో వ‌స్తుంది. 


వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ4 :


వ‌న్ ప్ల‌స్ ఫోన్ల‌లో బాగా హిట్ అయిన సిరీస్ నార్డ్. త‌క్కువ ధ‌ర‌కి మంచి ఫీచ‌ర్స్ తో అందుబాటులోకి తెచ్చారు నార్డ్ సిరీస్ ని. ఇక ఇప్పుడు కొత్త‌గా నార్డ్ సీఈ4 రిలీజ్ అయ్యింది. దీంట్లో డ్యూయెల్ క‌మెరా అమ‌ర్చారు. అది కూడా 50MP Sony LYT600  సెన్సార్, 8MP Sony IMX355 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా విష‌యానికొస్తే 16MP. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో వ‌స్తుంది ఈ ఫోన్. 


వీవో V30e : 


వీవో V30e ఫోన్ 6.78 ఇంచుల హెడ్ డీ డిస్ ప్లేతో వస్తోంది. ఇది ఆక్టా కోర్ స్నాప్ డ్రాగ‌న్ ప్రాసెస‌ర్ తో వ‌స్తోంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో 50MP SonyIMX 882 సెన్సార్ కెమెరాతో అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ఫోన్ లో స్పెష‌ల్ ఏంటంటే సెల్పీ కెమెరా కూడా 50MP. 


రెడ్ మీ నోట్ 13ప్రో+ :


ఈ ఫోన్ రూ.30వేల కంటే త‌క్కువ బ‌డ్జెట్ లో 5జీ, 6.67 ఇంచెస్ క‌ర్వ్ AMOLED డిస్ ప్లేతో వ‌స్తుంది. ట్రిపుల్ కెమెరా. 200MP Samsung ISOCELL HP3 ప్రైమ‌రీ సెన్సాన్, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్ తో వ‌స్తోంది. ఇక ఈ ఫోన్ లో ఫ్రంట్ కెమెరా 16MPగా ఉంది. 


Also Read: రియల్‌మీ నార్జో ఎన్63 సేల్ ప్రారంభం - రూ.8 వేలలోపే బడ్జెట్ ఫోన్!