Realme Narzo N63 Amazon Sale: రియల్‌మీ నార్జో ఎన్63 స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్, రియల్‌మీ ఇండియా అధికారిక వెబ్‌సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించారు. రియల్‌మీ నార్జో ఎన్63 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ప్రీమియం వేగన్ లెదర్ ఆప్షన్‌తో రియల్‌మీ నార్జో ఎన్63 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.
రియల్‌మీ నార్జో ఎన్63 ధర, ఆఫర్లు (Realme Narzo N63 Price in India)
ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ రెండిట్లో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా నిర్ణయించారు. అమెజాన్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్లలో రియల్‌మీ నార్జో ఎన్63ని కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.500 తగ్గింపు అందించనున్నారు. అంటే దీని ప్రారంభ వేరియంట్ రూ.7,999కే కొనుగోలు చేయవచ్చన్న మాట. లెదర్ బ్లూ, ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వీటిలో లెదర్ బ్లూ కలర్ మాత్రమే వేగన్ లెదర్ ఫినిష్‌తో మార్కెట్లోకి వచ్చింది.
Also Read: గేమింగ్ హబ్‌గా మారుతున్న యూట్యూబ్ - ప్లేయబుల్స్‌ను లాంచ్ చేసిన కంపెనీ!
రియల్‌మీ నార్జో ఎన్63 స్పెసిఫికేషన్లు (Realme Narzo N63 Features)
ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌ను కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై రియల్‌మీ నార్జో ఎన్63 పని చేయనుంది. 4 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. ముందువైపు సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఎయిర్ జెస్చర్, డైనమిక్ బటన్, మినీ క్యాప్సూల్ 2.0 వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కూడా రియల్‌మీ నార్జో ఎన్63లో అందించారు. మినీ క్యాప్యూల్ అనేది చూడటానికి యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఉంటుంది.
రియల్‌మీ నార్జో ఎన్63 బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో కంపెనీ అందించింది. ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయడానికి 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా అందించారు.
Read Also: 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు - మిడిల్ క్లాస్ కోసం బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, సూపర్ సౌండ్‌తో