WhatsApp: వాట్సాప్ భారతదేశంలో 71 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఏ దేశంలోనైనా ఒకేసారి ఇన్ని అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేయడం ఇదే తొలిసారి. భారతదేశంలో వాట్సాప్‌కు 50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ తెలుపుతున్న దాని ప్రకారం కంపెనీ కంప్లయన్స్ రిపోర్ట్ నివేదిక ఆధారంగా ఈ నిషేధం విధించింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధమైన కొన్ని కార్యకలాపాలు ఈ ఖాతాల్లో కనిపించాయి. ఇంతకు ముందు కూడా వాట్సాప్ భారతదేశంతో సహా ఇతర దేశాలలో ఇటువంటి ఖాతాలను నిషేధించింది.
భారతదేశంలో 50 కోట్లకు పైగా వినియోగదారులతో వాట్సాప్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌గా నిలిచింది. సెప్టెంబరులో వాట్సాప్ భారతదేశంలో రికార్డు స్థాయిలో 10,442 ఫిర్యాదులను అందుకుంది. వీటిలో 85 మందిపై చర్య తీసుకున్నారు. అంటే ఈ ఖాతాలు బ్యాన్ లేదా రీస్టోర్ చేశారు.
కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ యూజర్ సెక్యూరిటీ రిపోర్ట్‌లో వాట్సాప్ స్వీకరించిన యూజర్ కంప్లయింట్స్, దానిపై తీసుకున్న చర్యలు, అలాగే వాట్సాప్‌లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవటానికి కంపెనీ తీసుకున్న స్వంత నివారణ చర్యలు ఉన్నాయి. అదనంగా, కంపెనీ సెప్టెంబరులో దేశంలోని గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ నుంచి ఆరు ఆర్డర్‌లను అందుకుంది. అలాగే దానికి కట్టుబడి ఉంది.
లక్షలాది మంది భారతీయ సోషల్ మీడియా వినియోగదారులకు సాధికారత కల్పించేందుకు కంటెంట్, ఇతర సమస్యలకు సంబంధించి వారి ఆందోళనలను పరిశీలించే గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని కేంద్రం ఇటీవల ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన ఈ ప్యానెల్ పెద్ద టెక్ కంపెనీలను నియంత్రించేందుకు దేశంలోని డిజిటల్ చట్టాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నిర్ణయాలకు వ్యతిరేకంగా వినియోగదారులు చేసిన అప్పీళ్లను పరిశీలిస్తుంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వాట్సాప్ రాబోయే రోజుల్లో మరిన్ని ఖాతాలను బ్యాన్ చేసే అవకాశం ఉంది.
వాట్సాప్ ఖాతా బ్యాన్ అవ్వకుండా ఉండాలంటే జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్ వంటి అనధికారిక యాప్‌లు ఉపయోగించకూడదు. దీంతోపాటు మరొకరి పేరుతో ఖాతాలు ఓపెన్ చేయడం, అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెట్టకూడదు. వీటిని ఎవరైనా రిపోర్ట్ చేసినా, వాట్సాప్ స్వయంగా గుర్తించినా ఖాతాలు బ్యాన్ అవుతాయి.
మరోవైపు పెద్ద సైజున్న వీడియోలను ఫార్వార్డ్ చేయడానికి, రివైండ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే కొత్త అప్‌డేట్‌పై వాట్సాప్ పని చేస్తుంది. మీరు ఇప్పుడు యూట్యూబ్‌లో 10 సెకన్ల పాటు వీడియోను ఫార్వార్డ్ లేదా రివర్స్ చేయగలిగినట్లే, వాట్సాప్‌లో కూడా ఇలాంటి ఆప్షన్‌ను రానుంది. ఈ ఫీచర్ సహాయంతో మీరు పెద్ద వీడియోలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ చూడగలరు. తక్కువ సమయంలో ఉపయోగకరమైన కంటెంట్‌ను అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్‌ను గురించిన సమాచారం వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను రిపోర్ట్ చేసే Wabetainfo వెబ్‌సైట్ ద్వారా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.24.6లో మొదట కనిపించింది. ఇది కంపెనీ రాబోయే కాలంలో అందరు వినియోగదారులకు తీసుకువచ్చే అవకాశం ఉంది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?