భారతీయ బ్రాండ్ వూ తన కొత్త ఫ్లాగ్‌షిప్ టీవీని మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో ఏకంగా 75 అంగుళాల స్క్రీన్‌ను అందించారు. 4కే హెచ్‌డీఆర్ క్యూఎల్ఈడీ స్క్రీన్‌ను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ టెక్నాలజీ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో నాలుగు స్పీకర్లు ఉన్నాయి. దీని అవుట్‌పుట్ 40Wగా ఉంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.


వూ 75 అంగుళాల క్యూఎల్ఈడీ ప్రీమియం టీవీ ధర
ఈ టీవీ ధరను రూ.1,19,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది.


వూ 75 అంగుళాల క్యూఎల్ఈడీ ప్రీమియం టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. గూగుల్ ప్లేస్టోర్ యాక్సెస్ కూడా ఇందులో ఉంది. ఇందులో 75 అంగుళాల క్యూఎల్ఈడీ 4కే డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఎంఈఎంసీ టెక్నాలజీ ద్వారా 120 హెర్ట్జ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. చార్‌కోల్ గ్రే మెటల్ ఫ్రేమ్‌ను ఇందులో అందించారు. ఇందులో 64-బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి.


బ్లూటూత్ వీ5.0ని కూడా ఇందులో అందించారు. గేమింగ్ కంట్రోలర్స్, హెడ్ ఫోన్స్, స్పీకర్లు, కీబోర్డ్ కూడా ఇందులో ఉన్నాయి. హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు ఇందులో అందించారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, నాలుగు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఒక ఆడియో జాక్, రెండు యూఎస్‌బీ ఇన్‌పుట్స్ ఇందులో ఉన్నాయి.


నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, యూట్యూబ్‌లు ఇందులో ప్రీలోడెడ్‌గా రానున్నాయి. ఓటీటీ బటన్లు, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వైర్‌లెస్ కాస్టింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్, ట్యాబ్లెట్, విండోస్, ఆండ్రాయిడ్ ఆధారిత గ్యాడ్జెట్ల నుంచి ఈ టీవీకి కాస్ట్ చేయవచ్చు.


40W సౌండ్ అవుట్‌పుట్‌ను ఈ టీవీ అందించింది. డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియోలను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. స్టాండ్‌తో కలుపుకుంటే దీని బరువు 26.5 కేజీలుగా ఉండనుంది.


Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!


Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!


Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!


Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!


Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి