కరోనా అంటే దేశంలో భయపడేవారు భయపడుతున్నారు కానీ... కొంత మంది మాత్రం అసలేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పెళ్లిళ్ల వంటి వేడుకలపై ఆంక్షలు విధించి కఠినంగా అమలు చేస్తూంటే కొంతమంది మాత్రం పెంపుడు కక్కలకు పుట్టినరోజు వేడుకలు.. జంతువులకు అంతిమయాత్రలు ధూం..ధాంగా చేస్తూ వార్తలకెక్కుతున్నారు. అంతిమంగా వారిని అరెస్ట్ చేస్తున్నా ఎవరిలోనూ మార్పు రావడం లేదు.
Also Read: అకౌంట్లో రూ. 75 కోట్లు జమ.. ఆ కూలీ ఏం చేశాడంటే ?
మధ్య ప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా దాలుపురా గ్రామంలో ఓ కోతి చనిపోయింది. ఆ కోతికి ఆ గ్రామానికి అనుబంధం ఎక్కువ. గ్రామస్తులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అలా అనాథగా వదిలేయకుండా సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించాలని డిసైడయ్యారు. హరిసింగ్ అనే ఓ వ్యక్తి కర్మకాండలు చేయడానికి సిద్ధమయ్యారు. అచ్చంగా మనిషికి చేసినట్లే గుండు చేయించుకొని దానికి దహన సంస్కారాలు కూడా నిర్వహించాడు. గ్రామస్థులంతా డబ్బు పోగేసుకొని 1500 మందికి భోజనాలు కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటన గురించి తెలియడంతో రంగంలోకి దిగిన పోలీసులు, అంతక్రియలను నిర్వహించిన వారిలో ప్రధానమైన ఇద్దర్ని అరెస్టు చేశారు.
ఇదే కాదు.. రెండు వారాల కిందట గుజరాత్ లో ఓ కుక్కకు రూ.7 లక్షల ఖర్చుతో అత్యంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కూడా వైరల్ అయింది. అహ్మదాబాద్ లోని కిరణ్ పార్క్ సొసైటీలో ఉండే చిరాగ్ పటేల్ అబ్బే తన పెంపుడు శునకానికి బర్త్ డే అంగరంగవైభవంగా జరిపారు. రంగురంగుల విద్యుద్దీపాలు, డీజే, ఫ్లెక్సీలు... ఇలా అన్ని హంగులతో సంబరం చేశారు. లక్షలు ఖర్చయినా వెనుకంజ వేయలేదు. పుట్టినరోజు వేడుక సందర్భంగా కరోనా మార్గదర్శకాలు పాటించలేదంటూ చిరాగ్ పటేల్ తో పాటు ఆయన సోదరుడు ఉర్వీష్ పటేల్, దివ్యేశ్ మెహరియా అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు.
Also Read: Tollywood Jagan : ‘టాలీవుడ్ రియాక్షన్’ ఆపడమే అసలు వ్యూహం! జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా?
కరోనాతో చాలా మంది కనీసం మాస్క్‌లు పెట్టుకోకుండా బయటకు రావడానికి భయపడుతున్నారు. కానీ కొంత మంది మాత్రం కరోనా తమనేమీ చేయదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కరోనా వ్యాప్తి పెరిగిపోతంది.
Also Read: Covid Updates: తెలంగాణలో కొత్తగా 1920 కరోనా కేసులు, ఇద్దరు మృతి... 16 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
కరోనాతో చాలా మంది కనీసం మాస్క్‌లు పెట్టుకోకుండా బయటకు రావడానికి భయపడుతున్నారు. కానీ కొంత మంది మాత్రం కరోనా తమనేమీ చేయదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కరోనా వ్యాప్తి పెరిగిపోతంది.