మీ బ్యాంక్ అకౌంట్‌లో హఠాత్తుగా ఓ లక్ష రూపాయలు డిపాజిట్ అయితే ఏం చేస్తారు ?.  దేవుడు కరుణించాడనుకుని ఉన్న అప్పుల్లో కొన్ని తీర్చుకుంటారు .. లేకపోతే ఏదో ఒకటి కొనుక్కుంటారు. అదే రూ. పది లక్షలు.. రూ. కోటి డిపాజిట్ అయితే మాత్రం అంత నిమ్మళంగా ఉండలేరు. టెన్షన్ ప్రారంభమవుతుంది. ఎవరు డిపాజిట్ చేశారో..ఎందుకు చేశారో.. ఎప్పుడు ఎవరు వచ్చిఅడుగుతారో అన్న టెన్షన్ ఉంటుంది. అదే ఏకంగా రూ. 75 కోట్లు జమ అయితే  ఇక పరుగులు పెట్టుకుంటూ బ్యాంక్‌కో .. పోలీసుల వద్దకో వెళ్లడం ఖాయం. ఆ నిరుపేద అదే చేశారు.  ఎందుకంటే ఆయన అకౌంట్‌లో రూ. 75 కోట్లు జమ అయ్యాయి మరి...! 


Also Read: ఏళ్ల తర్వాత చేతికొచ్చిన చోరీ సొత్తు... అంతే ఏకంగా కోటీశ్వరులైపోయారు ! అదృష్టం వెదుక్కుంటూ వస్తే అంతే..


జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో జార్ముండి మండలం సాగర్‌ గ్రామానికి చెందిన పూలోరారు అనే వ్యక్తి.. భార్య, కుమారుడు కలిసి ఓ పూరి గుడిసెలో జీవిస్తున్నాడు. గ్రామంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో ఖాతా ఉంది. ప్రభుత్వం ఇచ్చే పించను అందులో జమ అవుతుంది. తనకు వచ్చిన పింఛను డబ్బులు తీసుకునేందుకు దగ్గరలోని సర్వీసు సెంటర్‌కు వెళ్లారు. రూ.10,000 తీసుకున్నారు. బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పమనేసరికి సిబ్బంది లెక్క చూసి ఇంకా రూ.75.28 కోట్లు ఉన్నట్లు చెప్పారు.


Also Read: Prakasam: ఈ భార్యాభర్తలు అన్నాచెల్లెళ్లుగా మారిపోయారు.. వామ్మో, వీరి ప్లాన్‌ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!


మొదటి సారి ఏదో తప్పు విన్నానననుమరోసారి అడిగారు పూలోరారు. రెండు..మూడు సార్లు కూడా అదే ఆన్సర్ వచ్చింది. దీంతో పూలోరారు అవాక్కయారు. అవెలా వచ్చాయో తనకు తెలియదని... ఈ విషయం బ్యాంకు అధికారులకు చేరవేశారు. ఫూలోరారు ఖాతాలోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో బ్యాంక్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది.. కానీ వివరాలు ఇంకా బయట పెట్టలేదు. 


Also Read: Hyderabad: ఎర్రగడ్డ సంతలో కత్తులు కొని మాజీ భార్యపై ఘాతుకం.. నడిరోడ్డుపైనే కత్తిపోట్లు


అసలే నిరుపేద.. పైగా ఎప్పుడూ ఉండే కష్టాలు ఉంటాయి .. అయినా కానీ ఆ సొమ్ములో ఎంంతో కొంత తీసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆ సొమ్ము ఎవరివో వారికిచ్చేస్తానంటున్నాడు. మొత్తంగా ఇప్పుడు రూ. 75 కథేమిటన్నది సోషల్ మీడియాకు సూపర్ హాట్ టాపిక్ అయింది. 



Also Read: Tollywood Jagan : ‘టాలీవుడ్ రియాక్షన్’ ఆపడమే అసలు వ్యూహం! జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి