రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కే మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో 43 అంగుళాల 4కే డిస్‌ప్లేను అందించారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని ద్వారా హెచ్‌డీఆర్10 కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 3,840 x 2,160 పిక్సెల్స్‌గా ఉంది. క్వాడ్‌కోర్ ఏ55 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. బ్లూటూత్ వీ5.0, వైఫై, ఎయిర్‌ప్లే 2, మిరాకాస్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉన్న 24W స్పీకర్లు, డీటీఎస్ వర్చువల్ ఎక్స్, డీటీఎస్ హెచ్‌డీ టెక్నాలజీ ఫీచర్లు అందించారు.


రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కే ధర
ఈ టీవీ ధరను రూ.26,999గా నిర్ణయించారు. ఎంఐ.కాం, అమెజాన్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కేపై ఒక సంవత్సరం ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా లభించనుంది.


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 4కే బెజెల్ లెస్ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్10 కంటెంట్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. అంతేకాకుండా ఇందులో 24W స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇందులో డాల్బీ ఆడియో, డీటీఎస్ ఎక్స్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.


2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. క్వాడ్‌కోర్ ఏ55 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫైర్ఓఎస్ 7 ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా, జీ5 యాప్స్‌ సహా మొత్తంగా 12 వేల యాప్స్‌కు సంబంధించిన కంటెంట్‌కు యాక్సెస్ లభించనుంది. దీంతోపాటు మల్టీపుల్ ప్రొఫైల్స్, పేరెంటల్ కంట్రోల్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ ఫైర్ టీవీలను కూడా సపోర్ట్ చేస్తుంది.


వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.0 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఏవీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కేలో ఉండనున్నాయి.


మరోవైపు రెడ్‌మీ ఏ2 ప్లస్ స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ లాంచ్ చేసిన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్. ఇందులో మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌ను అందించారు. మూడు వేర్వేరు కలర్ ఆప్షన్లలో రెడ్‌మీ ఏ2 ప్లస్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీని ధరను రూ.8,499గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్స్‌లో రెడ్‌మీ ఏ2 ప్లస్ కొనుగోలు చేయవచ్చు.





Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial