శాంసంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీని మనదేశంలో లాంచ్ చేసింది. దీన్ని కొనే ధరతో దాదాపుగా ఒక ఇంటినే కొనేయవచ్చు. ఈ కొత్త మైక్రో ఎల్ఈడీ టీవీలో 24.8 మిలియన్ల మైక్రోమీటర్ సైజున్న ఎల్ఈడీలు అందించారు. ఈ ఎల్ఈడీలను సాఫైర్ గ్లాస్‌తో రూపొందించారు. 110 అంగుళాల 4కే డిస్‌ప్లే ఈ టీవీలో ఉంది. ఎం1 ఏఐ ప్రాసెసర్‌తో ఈ టీవీ రూపొందింది. డాల్బీ అట్మాస్, టీవీ టు మొబైల్ మిర్రరింగ్, వైఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆడియో కోసం ఓటీఎస్ ప్రో, డాల్బీ అట్మాస్, క్యూ-సింఫనీ వంటి ఫీచర్లు అందించారు.


శాంసంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ ధర
ఈ శాంసంగ్ 110 అంగుళాల మైక్రో ఎల్ఈడీ టీవీ ధర రూ.1,14,99,000గా నిర్ణయించారు. అంటే దాదాపు రూ.1.15 కోట్లు అన్నమాట. దీన్ని శాంసంగ్.కాం, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ సేల్ ఎప్పుడు ప్రారంభం కానుందో తెలియరాలేదు.


శాంసంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 110 అంగుళాల మైక్రో ఎల్ఈడీ 4కే డిస్‌ప్లేను అందించారు. 24.8 మిలియన్ల మైక్రో ఎల్ఈడీలతో దీన్ని ఎక్విప్ చేశారు. అద్భుతమైన రంగులు, మెరుగైన క్లారిటీ, కాంట్రాస్ట్‌తో వినియోగదారులకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను ఈ టీవీ అందించనుంది. మైక్రో హెచ్‌డీఆర్, మల్టీ ఇంటెలిజన్స్ ఏఐ అప్‌స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్‌ప్యాన్షన్ ప్లస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. నాలుగు డిఫరెంట్ సోర్సుల నుంచి 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్పీడుతో కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు.


మినిమలిస్టిక్ మోనోలిత్ డిజైన్‌తో ఈ టీవీ మార్కెట్లోకి వచ్చింది. దీని బెజెల్స్ ఇన్‌విజిబుల్‌గా ఉంటాయి. అంచులు కూడా చాలా సన్నగా ఉంటాయి. దీంతోపాటు ప్రత్యేకంగా ఆర్ట్ మోడ్ కూడా ఈ టీవీలో అందించారు. ఈ ఫీచర్ ద్వారా ఈ టీవీని అందమైన ఆర్ట్ డిజైన్‌గా మార్చుకోవచ్చు.


మైక్రో ఎల్ఈడీల కారణంగా మైక్రో కాంట్రాస్ట్, మైక్రో కలర్, మైక్రో హెచ్‌డీఆర్, మైక్రో ఏఐ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం 6.2.2 ఛానెల్ సిస్టం ఉన్న 100W ఆర్ఎంఎస్ సౌండ్ సిస్టం కూడా ఉంది. ఓటీఎస్ ప్రో, డాల్బీ డిజిటల్ ప్లస్, క్యూ-సింఫనీ వంటి ఫీచర్లను ఇది సపోర్ట్ చేయనుంది. 110 అంగుళాల మైక్రో ఎల్ఈడీ టీవీలో సోలార్ సెల్ రిమోట్, ఇండోర్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా అందించారు. దీని మందం 2.49 సెంటీమీటర్లు కాగా, స్టాండ్ లేకుండా బరువు 87 కేజీలుగా ఉంది. 






Read Also: ఐఫోన్ లవర్స్‌ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial