Thread Edit and Voice note feature: థ్రెడ్స్‌పై యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచడానికి మెటా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాప్‌లో అందిస్తోంది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ థ్రెడ్స్‌కు రానున్న రెండు కొత్త ఫీచర్ల గురించి సమాచారం ఇచ్చారు.


త్వరలో మీరు పోస్ట్‌లు ఎడిట్ చేయడం, థ్రెడ్స్‌లో వాయిస్ నోట్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలిపే ఆప్షన్‌ను పొందుతారు. థ్రెడ్స్‌కు పోటీగా ఉన్న ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ ఎడిట్ ఫీచర్‌ను బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారుల కోసం మాత్రమే ఉంచారు. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి ట్విట్టర్ వినియోగదారుల నుంచి రూ. 900 వరకు వసూలు చేస్తుంది. అయితే ఈ ఫీచర్ థ్రెడ్స్‌లో పూర్తిగా ఉచితంగా లభించనుంది.


మీరు పోస్ట్‌‌ను ఐదు నిమిషాల వరకు ఎడిట్ చేయగలరు. పోస్ట్‌ను ఎడిట్ చేస్తే అందులో ఎడిటెడ్ అని కనిపిస్తుంది. కొంతమంది వినియోగదారులు థ్రెడ్స్‌కు సంబంధించిన ఈ రెండు కొత్త ఫీచర్లను పొందడం ప్రారంభించారు. అయితే ఈ అప్‌డేట్స్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. కాబట్టి ప్రతి అందరికీ అందుబాటులోకి రావడానికి టైమ్ పడుతుంది. రాబోయే కాలంలో కంపెనీ దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.


త్వరలో మీరు ట్విట్టర్ లాగానే థ్రెడ్స్‌లో ట్రెండింగ్ టాపిక్స్ ఆప్షన్‌ను పొందనున్నారు. మెటా ఉద్యోగి తీసిన స్క్రీన్‌షాట్ ద్వారా ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్‌ను మొదట యాప్ డెవలపర్ విలియం మాక్స్ చూశారని, తర్వాత ఈ చిత్రం వైరల్‌గా మారిందని మింట్ తన కథనంలో పేర్కొంది.


ట్విట్టర్ తరహాలోనే థ్రెడ్స్‌లో కూడా టాపిక్స్ పోస్ట్‌ను బట్టి ర్యాంక్ అవుతాయి. ఇవి ర్యాంకింగ్ ఆధారంగా ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. థ్రెడ్స్ గత నెలలోనే ఒక నవీకరణలో కీవర్డ్ సెర్చ్ ఫీచర్‌ను ఆవిష్కరించాయి.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial