WhatsApp: వాట్సాప్‌లో మీరు కచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిన ఫీచర్లు ఇవే - ఆన్‌లో ఉన్నాయో లేవో చూసుకోండి!

మీ వాట్సాప్‌లో కచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిన ప్రైవసీ ఫీచర్లు ఇవే.

Continues below advertisement

WhatsApp Privacy Settings: వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరచడానికి వాట్సాప్ యాప్‌లో అనేక ఫీచర్లను అందిస్తుంది. ఇటీవల కంపెనీ 'వాట్సాప్ ఛాట్' అప్‌డేట్‌ను కూడా ప్రారంభించింది. దీనిలో కంపెనీ ప్రైవసీకి సంబంధించిన ఫీచర్ల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుంది. మీ మొబైల్ ఫోన్‌లో వెంటనే ఆన్ చేయాల్సిన వాట్సాప్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోండి.

Continues below advertisement

వీటిలో మొదటిది 2FA ఫీచర్. వాట్సాప్ మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి 2FA ఫీచర్‌ను అందిస్తుంది. దీన్ని ఆన్‌లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మీరు మీ వాట్సాప్ అకౌంట్‌ను మరొక డివైస్‌లో ఓపెన్ చేసినప్పుడు లేదా మీ డివైస్‌లోనే నిర్దిష్ట సమయం తర్వాత దాన్ని ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ మీరు సెట్ చేసిన ఆరు అంకెల పిన్‌ను అడుగుతుంది. ఇది మీ అకౌంట్ సెక్యూరిటీని పెంచుతుంది.

వాట్సాప్‌లో యాప్ లాక్, ఛాట్ లాక్ కూడా ముఖ్యమైన ఫీచర్లే. వాట్సాప్ మీ ఛాట్‌లకు ప్రైవసీ పెంచడానికి యాప్ లాక్, ఛాట్ లాక్‌ ఫీచర్లను అందిస్తుంది. ఈ రెండు ఫీచర్లను ఆన్‌లో ఉంచడం ద్వారా మీ వాట్సాప్ అకౌంట్ మరింత సురక్షితం అవుతుంది. బయటి వ్యక్తులు ఎవరూ మీ చాట్‌లు లేదా డేటాను యాక్సెస్ చేయలేరు.

వాట్సాప్ సెట్టింగ్స్‌లో మీరు ప్రైవసీ చెకప్ అనే ఆప్షన్ కూడా చూడవచ్చు. దీని లోపల మీరు మీ ప్రైవసీని మెరుగుపరచడానికి అవసరమైన అన్ని ఆప్షన్లను చూడవచ్చు. మిమ్మల్ని గ్రూప్స్‌కు ఎవరు యాడ్ చేయవచ్చు , మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు చూడవచ్చు , మెసేజ్ టైమర్లు మొదలైన వాటిని ఇక్కడ నుండి మీరు సెట్ చేయవచ్చు.

త్వరలో వాట్సాప్ యాప్‌కి 'ఈ-మెయిల్ వెరిఫికేషన్' ఫీచర్‌ను కూడా యాడ్ చేయనున్నారు. ఇది కూడా వచ్చిన తర్వాత మొబైల్ నంబర్‌తో పాటు, ఈమెయిల్ ద్వారా కూడా మీ అకౌంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. అయితే దీని కోసం మీరు ముందుగా మీ ఈ-మెయిల్‌ను వాట్సాప్ అకౌంట్‌కు యాడ్ చేయాలి. ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ ఛాట్ బ్యాకప్ కోసం ఎలాగో జీమెయిల్ యాడ్ చేస్తారు కాబట్టి అదే ఈ-మెయిల్‌కు లింక్ చేస్తారేమో చూడాలి.

మరోవైపు మోటో జీ84 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో కేవలం ఒక్క స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మూడు కలర్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. మోటో జీ84 5జీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. 2022లో లాంచ్ అయిన మోటో జీ82 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది.

Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement