‘బిగ్ బాస్’ సీజన్ -7 ప్రారంభమైపోయింది. అయితే, ఈ సారి రూల్స్‌ను పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు ఎవరూ కన్ఫార్మ్ కాదని.. ‘పవర్ అస్త్ర’ సాధించినవారు మాత్రమే ఇంట్లో ఉంటారంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. పవర్ అస్త్ర లేనివారు బయటకు వెళ్లిపోతారని కొత్త లాజిక్ చెప్పారు నాగ్. అలాగే.. ఈ సారి ఎప్పటిలా ఆయన బిగ్ బాస్ హౌస్‌లో అడుగు కూడా పెట్టలేదు. రొటీన్‌కు భిన్నంగా.. త్వరగానే ఫస్ట్ కంటెస్ట్‌ను పరిచయం చేశారు. ‘జానకి కలగనలేదు’లో జానకి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక జైన్ మొదటి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దీంతో ఆమెనే ప్రేక్షకులకు హౌస్ చూపించమని నాగ్ చెప్పారు. దీంతో ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు హౌస్‌లోకి అడుగుపెట్టిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు వీళ్లే. మరి ‘పవర్ అస్త్ర’ తర్వాత వీరిలో ఎవరు మిగులుతారో చూడాలి.
‘బిగ్ బాస్’ సీజన్ 7లో మారిన రూల్స్ ఇవే:
⦿ నాగార్జున ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వలేదు.
⦿ ఇంట్లో ఫర్నీచర్ పెట్టకుండానే కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు.
⦿ ఆ తర్వాత టైమర్ పెట్టి.. ఫర్నీచర్ తీసుకునే అవకాశం ఇచ్చారు.
⦿ ఇప్పుడు ఇంట్లోకి వెళ్లిన కంటెస్టెంట్లు ఎవరూ పర్మినెంట్ కాదని హోస్ట్ నాగ్ చెప్పారు.
⦿ ఎవరికైతే ‘పవర్ అస్త్ర’ లభిస్తుందో వారే ఇంట్లో ఉంటారట.
⦿ పవర్ అస్త్ర పవర్.. అంతా జనాల చేతిలోనే ఉంటుందట.
⦿ ఈ సారి మాత్రం ప్రేక్షకులకు ఒక్క ఓటు మాత్రమే వేసే అవకాశం ఇచ్చారు.
⦿ గతంలో ఒక్కక్కరూ సుమారు 10 వరకు ఓట్లు వేసే ఛాన్స్ ఉండేది. ఆ రూల్‌ను ఇప్పుడు మార్చేశారు.
⦿ గతంలో సుమారు 21 మంది కంటెస్టెంట్లకు ఎంట్రీ ఉండేది. కానీ, ఈ షోలోకి 14 మందే వచ్చారు.
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీళ్లే
1. ప్రియాంక జైన్ (‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి)
2. శివాజీ (హీరో)
3. దామిని (సింగర్)
4. ప్రిన్స్ యవార్ (‘నా పేరు మీనాక్షి’ నటుడు)
5. శుభశ్రీ (లాయర్, నటి)
6. షకీలా (నటి)
7. ఆట సందీప్ (కొరియోగ్రాఫర్)
8. శోభా శెట్టి (‘కార్తీక దీపం’ నటి)
9. టేస్టీ తేజ (జబర్దస్త్ కమెడియన్)
10. రతిక (నటి, ఇన్‌ఫ్లూయెన్సెర్)
11. డాక్టర్ గౌతం (నటుడు)
12. కిరణ్ రాథోడ్ (నటి)
13. పల్లవి ప్రశాంత్ (రైతు)
14. అమర్ దీప్ (‘జానకి కలగనలేదు’ నటుడు)
70 రోజులేనా..?
మామూలుగా కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ హౌజ్‌లో కనీసం 100 రోజులు ఉండాలి. కానీ ‘బిగ్ బాస్’ సీజన్-7లో హౌజ్‌లోకి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంటర్ అయ్యారు. అంటే ఈసారి బిగ్ బాస్ కేవలం 70 రోజులు మాత్రమే ఉండబోతుందా అని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. లేదా ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీల విషయంలో కూడా ఏమైనా ట్విస్టులు ఉంటాయా అనేది కొన్నిరోజులు గడిచిన తర్వాత తెలుస్తుంది. ఒక ఎలిమినేషన్ జరుగుతున్న సమయంలోనే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందేమో అని కొత్తగా ఆలోచించడం కూడా మొదలుపెట్టేశారు బిగ్ బాస్ ఫ్యాన్స్.