14 మంది సభ్యులే ఎంట్రీ? ‘బిగ్ బాస్’ పెద్దగానే ప్లాన్ చేశాడు - వచ్చే వారం మరికొందరు?
ప్రతి ‘బిగ్ బాస్’ సీజన్‌లో సుమారు 21 మంది ఎంట్రీ ఇస్తుంటారు. అయిేత సీజన్ - 7లో మాత్రం 14 మంది సభ్యులు మాత్రమే ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం మరో ఏడుగురిని హౌస్‌లోకి పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ‘జానకి కలగనలేదు’ నటుడు అమర్ దీప్
‘జానకి కలగనలేదు’ సీరియల్ నటుడు అమర్‌దీప్ బిగ్ బాస్ హౌస్‌లోకి 14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. అంతకు ముందు రైతు పల్లవి ప్రశాంత్ 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.
హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ - సమంత ఎక్కడ అని అడిగిన నాగ్
విజయ్ దేవరకొండ ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా నాగార్జున సమంత ఎక్కడ అని అడిగారు. దీంతో విజయ్.. ‘‘తాను అమెరికా ప్రమోషన్స్, ట్రీట్మెంట్‌లో బిజీగా ఉంది’’ అని తెలిపాడు.
యూట్యూబ్‌లో క్రియేటీవ్ వీడియో చేస్తూ ఆకట్టుకున్న టేస్టీ తేజ ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వచ్చాడు. రజినీకాంత్ డైలాగ్, ఫన్నీ ప్రోమోతో ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకు ముందు తేజ ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందాడు.
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ‘కార్తీక దీపం’ విలన్, రాగానే టాస్క్ ఇచ్చిన నాగార్జున
‘కార్తీక దీపం’ సీరియల్‌లో విలన్‌గా మెప్పించిన శోభాశెట్టి.. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నాగ్ ఆమెకు ఒక టఫ్ టాస్క్ ఇచ్చారు. ఆమెను ఎవరైనా బాగున్నావు అని అంటే పనిష్మెంట్ ఇస్తానని అన్నారు.
బిగ్ బాస్‌లో అడుగుపెట్టిన షకీలా, ఆట సందీప్, దామిని, శుభశ్రీ, ప్రిన్స్ యావర్
బిగ్ బాస్ హౌస్‌లో 7వ కంటెస్టెంట్‌గా ఆట సందీప్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకు ముందు నటి షకీలా, గాయని సందీప్, నటి శుభ్రశ్రీ, నటుడు ప్రిన్స్ యావర్.. తదితరులు హౌస్‌లోకి వెళ్లారు.
‘బిగ్ బాస్’ సీజన్-7లోకి ‘జానకి కలగనలేదు’ నటి ప్రియాంక ఎంట్రీ ఇచ్చింది. తప్పకుండా తాను గెలిచి వస్తానంటూ శపథం చేసి మరీ ఇంట్లోకి వెళ్లింది. హౌస్ నాగ్ చూపించలేదు. జానకి స్వయంగా బిగ్ బాస్ హౌస్‌ను చూపించింది.
తార్ మార్ తక్కెెడ మార్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున. ఈ సీజనంతా మీరు ఊహకు అందని విధంగా.. ఉల్లాఫుల్టాగా సాగుతుందని చెప్పారు. ఈ సీజన్‌లో ఏ కంటెస్టెంట్ కన్ఫార్మ్ కాదు.
నటి షకీలాతోపాటు మరో హాట్ నటి.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రి ఇస్తోందట. ఆమె మరెవ్వరో కాదు.. కిరణ్ రాథోడ్. ఉదయ్ కిరణ్ నటించిన ‘శ్రీరామ్’ చిత్రంతోపాటు పలు తెలుగు, తమిళ సినిమాల్లో ఈమె నటించింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది.
కంటెస్టెంట్లకు రూ.35 లక్షలు ఆఫర్, హౌస్ నుంచి ఇప్పుడే వెళ్లిపోవచ్చన్న నాగ్
సాధారణంగా ‘బిగ్ బాస్’ ఎండింగ్‌లో క్యాష్ బ్యాక్స్ ఇచ్చి బయటకు వెళ్లిపోయేందుకు చివరి 5 సభ్యులు లేదా ముగ్గురు సభ్యులకు ఆఫర్ ఇస్తారు. అయితే, ఈ సారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ ఐదుగురికే ఆ అవకాశం వచ్చింది. హౌస్‌లోకి వచ్చిన వెంటనే వారికి ‘బిగ్ బాస్’ ఓ సూట్‌కేసు ఇచ్చాడు. ఎవరైనా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అనుకుంటే ఆ సూట్‌కేస్‌తో ఇప్పుడే వెళ్లిపోవచ్చని నాగార్జున షాకిచ్చారు. మరి కంటెస్టెంట్లు ఏ నిర్ణయం తీసుకున్నారనేది షో మొదలయ్యాక చూడాల్సిందే. ఆ సూట్ కేసులో సుమారు రూ.35 లక్షలు ఉన్నట్లు టాక్.
'బిగ్ బాస్ 7' కొత్త ప్రోమో వచ్చింది. ఈ ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి కొత్త సీజన్ షురూ కానున్న సంగతి తెలిసిందే. అందుకని, కొత్త ప్రోమో విడుదల చేశారు. అందులో ఓ సీన్ వచ్చిన తర్వాత 'ఇటువంటి క్లైమాక్స్ లు మనం ఎన్నో చూశాం కదా! ఈసారి ఎండింగ్ మార్చేద్దాం' అంటూ నాగార్జున డైలాగ్ చెప్పారు. 'అంతం కాదిది, ఆరంభం' అంటూ కొత్త సీజన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరేనంటూ వార్తలు వస్తున్నాయి. వారెవరో చూసేయండి. వీరు ఇప్పటికే స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోయారట. శనివారం షూటింగ్ మొదలై.. ఆదివారం రాత్రి 7 గంటలకు టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం.
‘బిగ్ బాస్’ సీజన్ - 7 మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆశక్తి నెలకొంది. గత సీజన్‌లో ‘బిగ్ బాస్’ పెద్దగా ఆకట్టుకోలేదు. చాలా చప్పగా కూడా సాగింది. ఈ నేపథ్యంలో గత తప్పిదాలు రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో ఈ సీజన్‌ను పగడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ‘బిగ్ బాస్’ సీజన్స్‌లో సెలబ్రిటీలకు బదులు.. సోషల్ మీడియా స్టార్సే ఎక్కువగా కనిపించారు. ప్రేక్షకులు మరిచిపోయిన సెలబ్రిటీలను కూడా తీసుకొచ్చి మమా అనిపించేవారు. అలాగే, మన సెలబ్రిటీలు కూడా ‘బిగ్ బాస్’లో పాల్గోడానికి పెద్దగా ఆశక్తి చూపడం లేదని, బయట ఉన్న ఆఫర్లు పోతాయనే భయంతో అటువైపు చూడటం లేదని తెలుస్తోంది. దీంతో ఈ సారి గట్టిగానే ముట్టజెప్పి.. ఎలాగైనా సరే ప్రేక్షకాధరణ పొందిన సెలబ్రిటీల కోసం ‘బిగ్ బాస్’ ద్వారాలను తెరిచి ఉంచాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు కొన్ని సీరియల్స్‌ను త్వరగానే ముగించేశారు. అందులో నటించిన స్టార్స్‌ను ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి తెచ్చేస్తున్నారు. అంతేకాదు, ప్రేక్షకులు మెచ్చిన పలువురు సినీ సెలబ్రిటీలను కూడా హౌస్‌లోకి ఆహ్వానిస్తున్నారట. ఇప్పటికే ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున సీజన్-7 గత సీజన్ల కంటే భిన్నంగా ఉంటుందని ఊరిస్తూ వస్తున్నారు. దీంతో మరోసారి ఈ షోపై అంచనాలు పెరిగాయి.
సెప్టెంబర్-3 నుంచి ఆరంభం
‘బిగ్ బాస్’ సీజన్ 7 ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి రికార్డెడ్ లైవ్‌ను ప్రసారం చేయనున్నారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసాదరం కానుంది. శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో దీన్ని లైవ్‌లో కూడా చూడవచ్చు. ఈ షోలో ఏయే కంటెస్టులు పాల్గోబోతున్నారనే వివరాలైతే గోప్యంగానే ఉన్నాయి. షో నిర్వాహకులు కూడా వారి పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ, కొంతమంది సెలబ్రిటీల ద్వారా పలువురి పేర్లు బయటకు వచ్చాయి. వారిలో కొందరి పేర్లతే దాదాపు ఖాయమైపోయినట్లే.
గమనిక: సోషల్ మీడియా, ఇతరాత్ర విశ్వసనీయ సమాచారం ప్రకారం పై జాబితాలోని సెలబ్రిటీల వివరాలను అందించాం. ఆఖరి క్షణంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. దీన్ని అధికారిక జాబితా భావించవద్దని మనవి.