టెక్నో పాప్ 5 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఐపీఎక్స్2 రేటింగ్ కూడా ఇందులో అందించారు.


టెక్నో పాప్ 5 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.8,499గా నిర్ణయించారు. డీప్‌సీ లస్టర్, ఐస్ బ్లూ, స్కై సియాన్ రంగుల్లో దీన్ని ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.


టెక్నో పాప్ 5 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఇందులో ఉండనుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 90 శాతంగా ఉంది.


3 జీబీ వరకు ర్యామ్, 32 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ఏఐ లెన్స్ అందించారు. ఏఐ పొర్‌ట్రెయిట్ మోడ్, హెచ్‌డీఆర్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 54 గంటల టాక్ టైం, 120 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఈ ఫోన్ అందించనుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీ లైఫ్ పెంచడం కోసం అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ కూడా ఇందులో టెక్నో అందించింది.


Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!


Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!


Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!


Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!


Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి