UK Lifts Covid Restrictions: బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఇక మాస్క్ తప్పనిసరి కాదు, వర్క్ ఫ్రమ్ హోం లేదు

ABP Desam Updated at: 20 Jan 2022 12:54 PM (IST)
Edited By: Murali Krishna

బ్రిటన్‌లో ఇక మాస్కులు తప్పనిసరి కాదని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

NEXT PREV

ప్రపంచ దేశాలు ఒమిక్రాన్‌కు గజగజ వణుకుతుంటే.. బ్రిటన్ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కొవిడ్ ఆంక్షలను మొత్తం ఎత్తివేస్తున్నట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. మాస్క్ తప్పనిసరి నిబంధన సహా ఆంక్షలన్నింటికీ ముగింపు పలికారు. ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం సదుపాయం కూడా ఉండదన్నారు.








ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో గరిష్ఠ స్థాయిని దాటేసిందని శాస్త్రవేత్తలు చెప్పారు. కనుక ఇప్పటినుంచి వర్క్​ ఫ్రం హోం, మాస్కు ధరించడం తప్పనిసరి ఏం కాదు. బూస్టర్​ డోసుల పంపిణీ వేగవంతం చేయడం కారణంగానే ఒమిక్రాన్​ నుంచి బయటపడిన తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది.                         -    బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధానమంత్రి


ఇక ప్లాన్- ఏ..


గత వేసవిలో చాలా మంది ప్రజలు వ్యతిరేకించినా దేశంలో కఠిన ఆంక్షలు విధించామని బోరిన్ అన్నారు. అప్పుడు అలా చేయడం వల్లే ఇప్పుడు ఇతర దేశాల్లో లాక్​డౌన్​ ఉన్నా తాము అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నామన్నారు.


ఫేస్​ మాస్కులు ధరించడం, కొవిడ్​ పాసులు తప్పనిసరి, వర్క్​ ఫ్రం హోం వంటివి ప్లాన్​- బీ నిబంధనల్లో భాగంగా ఉన్నాయని.. ఇప్పుడు వాటికి స్వస్తి పలికి ప్లాన్- ఏను అమలు చేస్తున్నామన్నారు.


రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, 1918లో సంభవించిన మహమ్మారి తర్వాత ఇదే తమకు అతి పెద్ద సవాలుగా బోరిస్ అభివర్ణించారు. ఇలాంటి సమయంలో ఏ ప్రభుత్వమైనా కొన్ని తప్పులు చేస్తుంటుందన్నారు.


Also Read: Cocktail Injection: అప్పుడు రెమిడిసివిర్, ఇప్పుడు కాక్‌టైల్.. కరోనా సోకితే ఇది తప్పకుండా వాడాలా? క్లారిటీ ఇచ్చిన డాక్టర్




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి



Published at: 20 Jan 2022 12:50 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.