శాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్లు ఫిబ్రవరిలో లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. శాంసంగ్ ఏ-సిరీస్‌లో బడ్జెట్ 5జీ ఫోన్లుగా ఇవి మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ లాంచ్ తర్వాత ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ32 5జీ రేంజ్‌లోనే.. దీని ధర కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ముందుగా తెలిపారు. శాంసంగ్ గెలాక్సీ ఏ32 ధర రూ.21,999గా ఉంది. గెలాక్సీ ఏ33 5జీ ధర కూడా అదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. అయితే శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ గురించిన వివరాలు మాత్రం తెలియరాలేదు.
శాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఇందులో ఐపీ67 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండనుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఈ ఫోన్ గత సంవత్సరమే అమెరికాలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కూడా ఉండనుంది. 6.5 అంగుళాల ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనున్నాయి. ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?