రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్ రెండర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించనున్నారు. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లే ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉండనుంది.
షియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ఈ స్మార్ట్ ఫోన్‌ను ట్విట్టర్‌లో టీజ్ చేశారు. ఈ ఫోన్ చైనాలో లాంచ్ కాబోవడం లేదు. ఈ ఫోన్ లీకైన రెండర్ల ప్రకారం.. కెమెరా మాడ్యూల్‌పై 108 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా అని రాసి ఉంది. దీర్ఘచతురస్రాకారంలో ఈ కెమెరా మాడ్యూల్ ఉండనుంది. వెనకవైపు నాలుగు కెమెరాలు, ఎల్ఈడీ కెమెరా ఉండనుంది.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇందులో వెనకవైపు ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం2 సెన్సార్ ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సార్ ఉండనుంది. 2 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ఓవీ2ఏ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ భారత్, గ్లోబల్ మార్కెట్లలో మాత్రమే లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పోకో వెర్షన్ కూడా పోకో ఎం4 ప్రో 5జీ పేరుతో మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. షియోమీయూఐ ఈ ఫోన్‌కు మీల్ అని పేరు పెట్టింది. ఈ ఫోన్ పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కూడా కనిపించింది.
ఈ ఫోన్‌ను మనుకుమార్ జైన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాబట్టి మనదేశంలో ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 10ఎస్ మనదేశంలో రూ.20 వేలలోపు ధరలోనే లాంచ్ అయింది. కాబట్టి రెడ్‌మీ నోట్ 11ఎస్ కూడా ఇదే రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!