ఒప్పో ఏ54 స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. ఈ ఫోన్ మనదేశంలో గతేడాది లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ క్రిస్టల్ బ్లాక్, స్టారీ బ్లూ రంగుల్లో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది.


ఒప్పో ఏ54 ధర
ఇందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,990 నుంచి రూ.13,990కు తగ్గింది. ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.15,490 నుంచి రూ.14,990కు, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,490 నుంచి రూ.15,990కు తగ్గించారు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.


ఒప్పో ఏ54 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.  ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను ఒప్పో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టు బాడీ రేషియో 89.2 శాతంగా ఉండగా, డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ గా ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఒప్పో ఏ54 పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఒప్పో ఏ54లో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. 


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఒప్పో ఏ54లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఈ కెమెరాల్లో ప్రధాన సెన్సార్ సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రోషూటర్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. ఒప్పో ఏ54 మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 192 గ్రాములుగానూ ఉంది.


Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!


Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!


Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!


Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?


Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి