వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్పెసిఫికేషన్లను కంపెనీ టీజ్ చేసింది. ఈ ఫోన్ అక్టోబర్ 13వ తేదీన లాంచ్ కానుంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 120 హెర్ట్జ్ డిస్‌ప్లే ఉండనున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 9ఆర్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ మొదట చైనాలో లాంచ్ కానుందని తెలుస్తోంది. అప్పుడే మనదేశంలో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ 9ఆర్‌టీ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్పెసిఫికేషన్లు
వీబోలో పోస్ట్ చేసిన టీజర్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 120 హెర్ట్జ్ శాంసంగ్ ఈ4 డిస్‌ప్లే ఉండనుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 65టీ వార్ప్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్ కూడా ఇందులో ఉండనుంది. మూడు షేడ్లలో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ 9ఆర్‌టీని అక్టోబర్ 13వ తేదీన లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.
వన్‌ప్లస్ 9ఆర్‌టీతో పాటు కొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ కూడా మనదేశంలో లాంచ్ కానున్నాయి. ఈ ఇయర్‌బడ్స్‌లో 40 డెసిబల్స్ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండనుంది. మిగతా వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది..
చైనాలో వన్ ప్లస్ 9ఆర్‌టీ, వన్‌ప్లస్ జెడ్2కు సంబంధించిన సేల్ అక్టోబర్ 19వ తేదీ నుంచి జరగనుంది. మనదేశంలో కూడా అక్టోబర్ 13వ తేదీన లాంచ్ అయితే.. అక్టోబర్ 19వ తేదీన మనదేశంలో కూడా సేల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇవి కచ్చితంగా మనదేశంలో లాంచ్ అయితే అవుతాయి.. కానీ ఎప్పుడు లాంచ్ అవుతాయనేదే సస్పెన్స్!
Also Read: Smart Watch Offers: రూ.1,000 లోపే స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్లు.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫర్లు
Also Read: Facebook Server Down: మళ్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. ఇంతకీ ఏమైనట్టు?
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!