ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 లీగ్‌ దశ ముగిసింది. నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోగా మరో నాలుగు జట్లు భారమైన హృదయంతో టోర్నీకి వీడ్కోలు పలికాయి. ఆఖరి నాలుగు రోజుల్లో పట్టికలో కింద ఉన్న జట్లు తమ విజయాలతో ఉత్కంఠ రేపినా.. ఊహించిన జట్లే  టాప్‌-4లో నిలిచాయి. మిగిలిన జట్లు వచ్చే సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తామంటూ మిత్రులకు వీడ్కోలు పలికాయి. అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో సందేశాలు పోస్టు చేశాయి.


Also Read: డేవిడ్‌ వార్నర్‌ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్‌ మంజ్రేకర్‌ అనుమానం!


ముంబయి ఇండియన్స్‌: ఈ సీజన్లో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌. 14 మ్యాచుల్లో 7 గెలిచి 7  ఓడిపోయింది. మొదట్లో ఎక్కువ మ్యాచులు ఓడిపోవడంతో ఆఖర్లో అవకాశాలు చేజారాయి. చివరి మ్యాచులో సన్‌రైజర్స్‌పై విజయం అందుకున్నా నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఫ్రాంచైజీ, ఆటగాళ్లు వీడ్కోలు పలుకుతూ ట్వీట్లు చేశారు.


Also Read: ఆఖరి బంతికి సిక్స్‌..! ఆ కిక్కులో ఆర్‌సీబీ చేసుకున్న సంబరాలు చూడండి










పంజాబ్‌ కింగ్స్‌: రాహుల్‌సేన ఎప్పటిలాగే అభిమానులకు ఉత్కంఠతో కూడిన ఎంజాయ్‌మెంట్‌ ఇచ్చింది. చాలా మ్యాచుల్లో విజయాలకు చేరువై ఆఖర్లో బోల్తా పడింది. పదికి పైగా మ్యాచులకు పైగా గెలవాల్సింది పోయి ఆరు విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఏదేమైనా ఈ సీజన్లో గొప్ప పాఠాలు నేర్చుకున్నామని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. కోచ్‌ కుంబ్లే ఆటగాళ్లకు చివరి సందేశం ఇచ్చాడు.


Also Read: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం










రాజస్థాన్‌ రాయల్స్‌: రెండో అంచెలో రాజస్థాన్‌ రాయల్స్‌ బలహీనంగా మారింది. అయితే  సీజన్లో కొన్ని గొప్ప ఛేదనలు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు మురిపించారు. సంజు శాంసన్‌ తొలిసారి కెప్టెన్‌గా పాఠాలు నేర్చుకున్నాడు. ఆ జట్టు ఐదు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. తనకు ఎవరిపైనా ఫిర్యాదులు లేవని, మైదానంలో ప్రదర్శన అనుకున్నట్టుగా చేయలేకపోయామని అతడు చెప్పాడు. విదేశీ క్రికెటర్లు బయో బుడగను వీడారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి










సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: ఆరెంజ్‌ ఆర్మీకి ఈ సీజన్‌ ఒక పీడకల లాంటిది! మధ్యలోనే డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీ వదిలేశాడు. హైదరాబాద్‌తో బంధం ముగిసిందని పరోక్షంగా చెప్పేశాడు. జట్టు యాజమాన్యంలో సమస్యలు ఉన్నట్టు అనిపించింది. విలియమ్సన్‌ సైతం కెప్టెన్‌గా జట్టు తలరాత మార్చలేకపోయాడు. ఆ జట్టు కేవలం మూడు విజయాలే అందుకుంది. వచ్చే సీజన్లో చూసుకుంటామని ట్రెవర్‌ బేలిస్‌, టామ్‌ మూడీ, విలియమ్సన్‌ అన్నారు.