వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ జనవరి 11వ తేదీన లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే లాంచ్‌కు ముందు.. వన్‌ప్లస్ సీఈవో పీట్ లా దీని స్పెసిఫికేషన్లు టీజ్ చేశారు. అయితే ఈ ఫోన్ ధర, వేరియంట్ల వివరాలు కూడా ఇప్పుడు లీకయ్యాయి. వీటితో పాటు ఈ ఫోన్‌కు సంబంధించిన శాంపిల్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. వన్‌ప్లస్ 10 ప్రోలో వెనకవైపు హాజిల్‌బ్లాడ్ పవర్డ్ కెమెరా సెటప్‌ను ఉపయోగించారు.
వన్‌ప్లస్ 10 ప్రో ధర (అంచనా)
ఇందులో మూడు వేరియంట్లు ఉండనున్నాయని తెలుస్తోంది. లీకైన వివరాలను బట్టి.. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగానూ (సుమారు రూ.46,600), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,599 యువాన్లుగానూ (సుమారు రూ.53,600), టాప్ ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లుగానూ (సుమారు రూ.58,300) ఉండే అవకాశం ఉంది. దీన్ని బట్టి వన్‌ప్లస్ 10 ప్రో ధర మనదేశంలో రూ.50-55 వేల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 9 ప్రో రూ.64,999 ధరతో మనదేశంలో లాంచ్ అయింది. ఆ ఫోన్ కంటే సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వన్ ప్లస్ 10 ప్రో ధర తగ్గే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు (టీజ్ చేసినవి)
వన్‌ప్లస్ 10 ప్రో కెమెరా ఫీచర్లను కంపెనీ ఇటీవలే టీజ్ చేసింది. ఇందులో 150 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉన్న 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌ను అందించనున్నారు. దీంతోపాటు ఇందులో ఫిష్ ఐ మోడ్ అనే ఫీచర్ కూడా ఉంది. ఈ కెమెరాలో 110 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉండనుంది.
సెకండ్-జెన్ హాజిల్‌బ్లాడ్ ప్రో మోడ్ ద్వారా వన్‌ప్లస్ 10 ప్రోలో వినియోగదారులు 12-బిట్ రా ఫొటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. రా+ సపోర్ట్‌తో ఈ స్మార్ట్ ఫోన్ జేపీఈజీ, రా ఇమేజెస్‌ను ఒకేసారి క్యాప్చర్ చేయగలదు. ఇందులో ఉన్న మూవీ మోడ్ ద్వారా వినియోగదారులు ఐఎస్‌వో, షట్టర్ స్పీడ్, ఇతర సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. ప్రీసెట్ ప్రొఫైల్ పిక్చర్ లేకుండానే లాగ్ ఫార్మాట్‌లో వినియోగదారులు షూట్ చేయవచ్చు.
వెనకవైపు ఉన్న మూడు కెమెరాల్లోనూ 10-బిట్ కలర్ ఫొటోగ్రఫీ ఉన్న ఏకైక స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రోనే అని తెలుస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్లకు వైడర్ కలర్ గాముట్‌ను అందించనుందని తెలుస్తోంది.
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!