2022లో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్లలో వన్‌ప్లస్ 10 సిరీస్ కూడా ఉంది. ఇందులో వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ ఎలా ఉండనుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఫోన్ జనవరిలోనే లాంచ్ కానుందని కంపెనీ సీఈవో పీట్ లా అధికారికంగా తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. లాస్ వెగాస్‌లో జరగనున్న సీఈఎస్ (2022) కార్యక్రమంలో ఈ ఫోన్‌ని కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.


పీట్ లా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ జనవరిలో లాంచ్ కానుంది. అయితే సరిగ్గా ఏ తేదీన లాంచ్ కానుందనే విషయాన్ని మాత్రం తెలపలేదు. 2022 మొదటి త్రైమాసికంలోనే ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుంది. అయితే మొదట మాత్రం సొంత దేశం చైనాలో లాంచ్ కానుంది.


ఈ సీఈఎస్ కార్యక్రమం జనవరి 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య జరగనుంది. అమెరికాలోని లాస్ వెగాస్ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. 2021లో కరోనావైరస్ కారణంగా సీఈఎస్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అయితే ఈసారి అలా కాకుండా ముఖాముఖిగా ఈ కార్యక్రమం జరగనుంది.


ప్రముఖ టిప్‌స్టర్ మ్యాక్స్ జంబోర్ తెలుపుతున్న దాని ప్రకారం.. వన్‌ప్లస్ లాంచ్ ఈవెంట్ జనవరి 5వ తేదీన జరగనుంది. అయితే లాస్ వెగాస్‌లోని సీఈఎస్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని సమాచారం ఉన్నప్పటికీ.. వన్‌ప్లస్ ఏమేం లాంచ్ చేయనుందో మాత్రం తెలియరాలేదు.


ఇప్పుడు వినిపిస్తున్న వార్తలే నిజమైతే వన్‌ప్లస్ 10 ప్రో సిరీస్ మొత్తం ఈ ఈవెంట్లోనే లాంచ్ అయింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు వన్‌ప్లస్ 10 సిరీస్‌లో వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 10ప్రోలతో పాటు.. వన్‌ప్లస్ 10ఆర్‌టీ కూడా లాంచ్ అవుతుందా.. ఈసారి రెండు స్మార్ట్ ఫోన్లకే పరిమితం అవుతారా అనేది తెలియాల్సి ఉంది.


Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?


Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి