యాపిల్ ఇటీవలే ఐఫోన్ 13 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. 2022లో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ కానుంది. ఐఫోన్ 14 సిరీస్ కూడా లాంచ్ కాకముందే ఐఫోన్ 15 గురించిన లీకులు కూడా వస్తున్నాయి.
ఐఫోన్ 15 సిరీస్‌లో సిమ్ కార్డు స్లాట్ గురించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తుంది. ఇందులో ఫిజికల్ సిమ్ కార్డు వేసుకునే అవకాశం లేకుండా.. స్లాట్‌ను పూర్తిగా తీసేయనున్నట్లు తెలుస్తోంది. అంటే ఇందులో ఈ-సిమ్ ఉపయోగించడం తప్ప వేరే ఆప్షన్ లేదన్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే అసలు సిమ్ కార్డు స్లాట్ లేని ఐఫోన్లను మనం 2023లో చూడవచ్చు.
ఈ విషయాన్ని పోర్చుగల్‌కు చెందిన ఒక బ్లాగ్ ముందుగా తెలిపింది. ఈ కథనాన్ని బట్టి ఐఫోన్ 15 ప్రో మోడళ్లలో డ్యూయల్ ఈ-సిమ్ సపోర్ట్ ఉండనుంది. అంటే సిమ్ కార్డు స్లాట్ లేకపోయినా.. రెండు సిమ్‌లను ఈ ఫోన్లలో ఉపయోగించవచ్చన్న మాట. ఐఫోన్ 15 ప్రో మోడళ్లలో డ్యూయల్ ఈ-సిమ్ సపోర్ట్‌ను అందించినప్పటికీ.. సాధారణ మోడళ్లకు ఈ ఫీచర్ వస్తుందో రాదో చూడాల్సి ఉంది.
భవిష్యత్తులో ఐఫోన్లు ఎలా ఉండనున్నాయి?
అసలు ఒక్క పోర్టు కూడా లేని ఫోన్‌ను రూపొందించడానికి యాపిల్ ప్రయత్నిస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ యాపిల్ ఫిజికల్ సిమ్ కార్డు స్లాట్‌ను తీసేయడానికి ప్లాన్ చేస్తే.. 2023లో వచ్చే ఐఫోన్లలో చార్జింగ్ పోర్టు ఉంటుందో లేదో చూడాలి.
అన్ని స్మార్ట్ ఫోన్లలోనూ కామన్‌గా యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించాల్సిందిగా యూరోపియన్ కమిషన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లను అడగనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఐఫోన్ సిమ్ కార్డు స్లాట్ గురించి కూడా కథనాలు రావడం ఏమాత్రం యాదృచ్ఛికం కాదు.
2017లో యాపిల్ మొదటిసారి వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఐఫోన్ 8 సిరీస్‌తో దీన్ని మొదటిసారి అందుబాటులోకి తీసుకువచ్చారు. 2020లో మాగ్‌సేఫ్ బ్రాండెడ్ వైర్‌లెస్ చార్జింగ్ డివైసెస్‌ను కంపెనీ లాంచ్ చేసింది.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?