Xiaomi 14 Pro Launch: షావోమీ 14 ప్రో (Xiaomi 14 Pro) మొబైల్‌ను కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. ఇందులో కొత్తగా లాంచ్ అయిన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించడం విశేషం. ప్రపంచంలో ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. షావోమీ హైపర్ఓఎస్‌తో లాంచ్ అయిన మొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 2కే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.


షావోమీ 14 ప్రో ధర (Xiaomi 14 Pro Price)
ఈ హైఎండ్ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లు (సుమారు రూ.56,500) కాగా, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,499 యువాన్లుగా (సుమారు రూ.62,000) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,999 యువాన్లుగా (సుమారు రూ.68,200) నిర్ణయించారు.


షావోమీ 14 ప్రో మోడల్లో 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్‌లో ప్రత్యేకంగా టైటానియం ఎడిషన్ కూడా లాంచ్ అయింది. దీని ధర 6,499 యువాన్లుగా (సుమారు రూ.74,000) ఉంది.


క్లాసిక్ బ్లాక్, రాక్ బ్లూ, స్నో మౌంటెయిన్ పింక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా చైనాలో ఇప్పటికే షురూ అయ్యాయి. అయితే మనదేశంలో ఇవి ఎప్పుడు లాంచ్ అవుతాయనేది మాత్రం కంపెనీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.


షావోమీ 14 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Xiaomi 14 Pro Specifications, Features)
ఈ స్మార్ట్ ఫోన్‌లో కంపెనీ లేటెస్ట్‌గా లాంచ్ చేసిన హైపర్ఓఎస్ ఇంటర్‌ఫేస్‌ను అందించనున్నారు. 6.73 అంగుళాల 2.5డీ ఎల్టీపీవో డిస్‌ప్లే షావోమీ 14 ప్రోలో ఉంది. 2కే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు కూడా అందించారు. లేటెస్ట్‌గా లాంచ్ అయిన బ్రాండ్ న్యూ 4ఎన్ఎం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌‌పై షావోమీ 14 ప్రో పని చేయనుంది. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు లెయికా బ్రాండెడ్ సెటప్ ఉంది. ఇందులో మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ హంటర్ 900 సెన్సార్ అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.


కనెక్టివిటీ విషయానికి వస్తే... 5జీ, వైఫై 7, యూఎస్‌బీ 3.2 పోర్టు, బ్లూటూత్, జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, బైదు, నావిక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, లీనియర్ మోటార్, ఐఆర్ బ్లాస్టర్, ఫ్లిక్కర్ సెన్సార్, కలర్ సెన్సార్ కూడా అందించారు. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉన్నాయి. ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్‌ను గేమింగ్ కోసం అందించారు. డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు వీటిలో చూడవచ్చు. ఐపీ68 రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 4880 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా షావోమీ 14 ప్రోలో ఉన్నాయి. 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ కూడా ఇందులో అందించారు. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 223 గ్రాములుగా ఉంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial