తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంలో ముందుంటుంది వాట్సాప్. వినియోగదారుల ఛాటింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులు బాటు ఉండేది. కానీ, తాజాగా తీసుకొచ్చిన ఫీచర్ లో ఇకపై ఒకే ఫోన్ లో రెండు అకౌంట్స్ ను మెయింటెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ వల్ల రెండు ఫోన్ నెంబర్లతో రెండు వాట్సప్ అకౌంట్స్, ఒకే ఫోన్లో వినియోగించుకోవచ్చునని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.
ఇకపై ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ అకౌంట్స్
ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న చాలా స్మార్ట్ ఫోన్లు రెండు సిమ్స్ తో వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రెండు ఫోన్ నెంబర్లు వాడుకుంటున్నారు. అందులో ఒకటి అఫీషియల్ కాగా, మరొకటి పర్సనల్. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఒక్క ఫోన్ నెంబర్ తోనే ఇప్పటి వరకు వాట్సాప్ సేవలు వినియోగించుకునేందుకు అవకాశం ఉండేది. రెండో నెంబర్ మీద ఉన్న వాట్సాప్ వాడాలంటే మొదటి నెంబర్ వాట్సాప్ నుంచి లాగ్ అవుట్ కావాల్సి ఉండేది. కానీ, కొత్తగా వాట్సాప్ తెస్తున్న ఫీచర్ తో రెండు ఫోన్ నెంబర్లతో రెండు వాట్సప్ ఖాతాలను ఒకే ఫోనులో వాడుకోవచ్చు. త్వరలో ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. ఇక వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ ను ఎలాంటి క్లోనింగ్ యాప్స్ వాడకుండానే రెండు అకౌంట్స్ ను మెయింటెయిన్ చేసుకోవచ్చు. కుటుంబ అవసరాలకు ఒక వాట్సాప్, ఉద్యోగానికి సంబంధించి అవసరాలకు మరో వాట్సప్ వాడుకోవచ్చు. లేదంటే రెండింటినీ తమకు నచ్చినట్లుగా వినియోగించుకోవచ్చు.
ఒకే ఫోన్లో రెండు వాట్సాప్ ను ఎలా ఓపెన్ చేయాలంటే?
1. మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పైభాగంలో మూడు చుక్కలను క్లిక్ చేయాలి..
2. ఈ మూడు చుక్కలను క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
3. ఆ తర్వాత అకౌంట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
4. అనంతరం యాడ్ అకౌంట్ పై క్లిక్ చేయాలి.
5. రెండో వాట్సాప్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
6. కుడివైపున పై భాగంలోని మూడు చుక్కలను క్లిక్ చేసి కావాల్సినప్పుడల్లా రెండు ఖాతాలను స్విచ్ఛాన్, స్విచ్ఛాఫ్ చేసుకోవచ్చు.
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
Read Also: డిస్నీప్లస్ హాట్‌స్టార్ కొత్త రికార్డు - కింగ్ క్రీజులో ఉన్నప్పుడు ఎంత మంది చూశారో తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial