Vivo X90 Pro: వివో ఎక్స్90 ప్రో స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ భారీ తగ్గింపును అందించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. అంతేకాకుండా ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి.


వివో ఎక్స్90 ప్రో ధర, ఆఫర్
ఇందులో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మనదేశంలో రూ.84,999 ధరతో లాంచ్ అయింది. దీన్ని రూ.10 వేలు తగ్గించి రూ.74,999కు తీసుకొచ్చారు. ఒరిజినల్ బ్లాక్ షేడ్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


వివో ఎక్స్90 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో వివో ఎక్స్90 ప్రో పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. వివో ఎక్స్90 ప్రో యాస్పెక్ట్ రేషియో 20:09గా ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 93.53 శాతంగానూ, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. ఆక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌పై వివో ఎక్స్90 ప్రో పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కూడా అందించారు.


కెమెరాల విషయానికి వస్తే... వివో ఎక్స్90 ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ జీస్ వన్ ఇంచ్ సెన్సార్‌ ఉంది. ఈ సెన్సార్‌తో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


120W ఫాస్ట్ చార్జింగ్‌, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ కూడా వివో ఎక్స్90 ప్రో సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 50 శాతం చార్జింగ్ కేవలం 8 నిమిషాల్లోనే చార్జింగ్ ఎక్కనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4870 ఎంఏహెచ్‌గా ఉంది. 5జీని కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 214.85 గ్రాములుగా ఉంది.


మరోవైపు వివో ఇటీవలే వై16, వీ02టీ స్మార్ట్ ఫోన్లపై ధరల తగ్గింపును అందించింది. ఈ రెండు ఫోన్ల ధర రూ.500 వరకు తగ్గింది. ఈ రెండూ వివో బడ్జెట్ ధరల మోడల్సే. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌నే కంపెరనీ ఈ రెండు ఫోన్లలోనూ అందించింది. వీటి ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. వీటిలో కెమెరా విషయంలో మాత్రమే కాస్త మార్పులు చేశారు. వివో వై16... మోటో జీ52, రెడ్‌మీ నోట్ 10ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22లతో పోటీ పడనుంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial