Samsung Galaxy A05s: శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్‌ను కంపెనీ అందించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 5జీ కనెక్టివిటీని ఈ ఫోన్ సపోర్ట్ చేయదు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ సపోర్ట్ చేయనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ ధర (Samsung Galaxy A05s Price)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.17,499గా నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ఈ ఫోన్ రూ.14,99కే కంపెనీ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. అయితే ఎస్‌బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలతో కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ వయొలెట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Samsung Galaxy A05s Specifications, Features)
ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. అంటే ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ముందుగానే ఇన్‌స్టాల్ అయి రానుందన్న మాట. ఆండ్రాయిడ్ ఓఎస్ మీద శాంసంగ్ వన్ యూఐ 5.1 ఇంటర్‌ఫేస్ ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. 6 జీబీ ర్యామ్ కూడా ఉంది.


ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉంది. యాక్సెలరో మీటర్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 194 గ్రాములుగా ఉంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial