Oneplus Open Price: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను అక్టోబర్ 19వ తేదీన భారతదేశంలో లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ ముంబైలో జరుగుతోంది. రాత్రి 7:30 గంటలకు ఫోన్ భారతదేశంలో లాంచ్ కానుంది. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్లు, స్టోర్ల నుంచి మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. కొంతకాలం క్రితం వన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్ ఫోన్ ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేతిలో కనిపించింది. ఈ ఫోన్ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు వన్‌ప్లస్ ఓపెన్ ధరను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ చేశారు.


ఈ లీక్ ప్రకారం భారతదేశంలో వన్‌ప్లస్ ఓపెన్ ధర రూ. 1,39,999గా ఉండనుంది. అక్టోబర్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ తొలి ఫోల్డబుల్ ఫోన్ లాంచ్‌తో శాంసంగ్, మోటొరోలాకు పోటీ మరింత పెరగనుంది. ప్రస్తుతం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. కంపెనీ గత మూడు, నాలుగు సంవత్సరాల్లో అనేక ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌లను లాంచ్ చేస్తుంది.


వన్‌ప్లస్ ఓపెన్ ఫీచర్లు ఇలా...
వన్‌ప్లస్ ఓపెన్ స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే 7.8 అంగుళాల 2కే ఇంటర్నల్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 6.31 అంగుళాల ఔటర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ రానుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌లపై ఈ ఫోన్ పని చేస్తుంది. మీరు మొబైల్ ఫోన్‌లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌ను పొందుతారు. ఫోల్డబుల్ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌‌ను సపోర్ట్ చేసే 4800 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. మీరు ఈ మొబైల్ ఫోన్‌లో అలర్ట్ స్లైడర్‌ని కూడా పొందుతారు.


ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే... ఈ ఫోన్‌లో ఐదు కెమెరాలు ఉండనున్నాయి. వన్‌ప్లస్ ఓపెన్‌లో మీరు వెనుకవైపు సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ని పొందుతారు. ఇందులో 48 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉండవచ్చు. ముందు వైపున ఔటర్ డిస్‌ప్లేలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అంతర్గత డిస్‌ప్లేలో 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించే అవకాశం ఉంది. 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయవచ్చు. వన్‌ప్లస్ ఓపెన్ భారతదేశంలో క్రీమ్ గోల్డ్, ఆలివ్ కలర్ ఆప్షన్‌లలో తీసుకురానుందని తెలుస్తోంది.


వన్‌ప్లస్ మొదట లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్ తర్వాత దీనిపై మంచి హైప్ జనరేట్ అయింది. మరి ఈ అంచనాలను ‘వన్‌ప్లస్ ఓపెన్’ అందుకుంటుందేమో చూడాలి!


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial