హానర్ మ్యాజిక్ వీఎస్ 2 స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇది ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ మ్యాజిక్ వీఎస్ పని చేయనుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మార్కెట్లో లాంచ్ అయిన హానర్ మ్యాజిక్ వీఎస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఇది ఎంట్రీ ఇచ్చింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను హానర్ కొత్త ఫోన్ సపోర్ట్ చేయనుంది.


హానర్ మ్యాజిక్ వీఎస్ 2 ధర
ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని ధర 6,999 యువాన్ల (సుమారు రూ.79,900) నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ హానర్ మనదేశంలో కూడా స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయడం ప్రారంభించింది. కాబట్టి త్వరలోనే హానర్ ఫోల్డబుల్ ఫోన్ మనదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.


హానర్ మ్యాజిక్ వీఎస్ 2 స్పెసిపికేషన్లు, ఫీచర్లు
హానర్ మ్యాజిక్ వీఎస్ 2లో 7.92 అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్‌ను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ లెవల్ 1600 నిట్స్‌గా ఉంది. యాస్పెక్ట్ రేషియో 9.78:9 కాగా, 6.43 అంగుళాల ఓఎల్ఈడీ కవర్ స్క్రీన్ కూడా అందించారు.


ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై హానర్ మ్యాజిక్ వీఎస్ 2 రన్ కానుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 20 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడ ఉన్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5జీ, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు దీని మందం 0.51 సెంటీమీటర్లుగానూ, ఫోల్డ్ చేసినప్పుడు 1.07 సెంటీమీటర్లుగానూ ఉండనుంది.  దీని బరువు 229 గ్రాములుగా ఉంది.


హానర్ ఇటీవలే మనదేశంలో హానర్ 90 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ధరను బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.37 వేల నుంచి రూ.26,999కు తగ్గించారు.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial