SmartPhone Tips: ఒక దశాబ్దం క్రితం వరకు ప్రజల చేతిలో కీప్యాడ్ ఉన్న చిన్న ఫోన్‌లు ఉండేవి. కానీ స్మార్ట్‌ఫోన్ రివల్యూషన్ ప్రారంభం అయిన నాటి నుంచి, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించినప్పుడు వాటిలో 16 జీబీ వరకు స్టోరేజ్ ఉండేది. అప్పుడు ఈ స్టోరేజ్ 128 జీబీ, 256 జీబీ, 512 జీబీకి పెరిగింది. ఇప్పుడు 1 టీబీ (1024 జీబీ) స్టోరేజ్ ఉన్న ఫోన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.


స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజీ పెరిగిపోవడంతో వాటికి ఇబ్బందులు కూడా ఎక్కువయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌లో చిన్నపాటి సమస్య వచ్చినా, దాన్ని సరిచేయడానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కోసారి రిపేర్ కంటే కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌ల్లో ఎక్కువగా వచ్చే మూడు సమస్యల గురించి తెలుసుకుందాం. కొన్ని టిప్స్ ఫాలో అయితే వీటిని రాకుండా ఆపవచ్చు.


స్మార్ట్‌ఫోన్ స్లో అవ్వడం
స్మార్ట్‌ఫోన్‌లలో ఈ సమస్య సర్వసాధారణం. కొన్న తర్వాత కొంతకాలానికి అన్ని స్మార్ట్‌ఫోన్‌లు స్లో అవుతాయి. దీన్ని పరిష్కరించడానికి మీరు మీ స్మార్ట్‌ఫోన్ నుండి అనవసరమైన యాప్‌లను తొలగించి, ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీంతో పాటు స్మార్ట్‌ఫోన్ మెమరీని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ మునుపటి కంటే వేగంగా పనిచేయడం ప్రారంభం అవుతుంది.


మొబైల్ వేడెక్కడం
మీరు రోజంతా ఫోన్‌కి అతుక్కుపోయి ఉంటే, ఫోన్ ఖచ్చితంగా వేడిగా మారుతుంది. మనకు విశ్రాంతి ఎంత అవసరమో, అదేవిధంగా స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్స్‌కు కూడా కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఈ సమస్యను తగ్గించడానికి మీరు ఫోన్‌ను పవర్ సేవర్ మోడ్‌లో ఉంచాలి. స్క్రీన్ బ్రైట్‌నెస్ కూడా తగ్గించండి. వైఫై, బ్లూటూత్‌లను అనవసరంగా ఉపయోగించవద్దు. బ్యాటరీ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ ఉపయోగించవద్దు.


స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ డౌన్ అవ్వడం
మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ త్వరగా అయిపోతే, మీ ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించ వలసి ఉంటుంది. అలాగే లొకేషన్ సర్వీస్, బ్లూటూత్, మొబైల్ డేటా, జీపీఎస్ వంటి సేవలను ఎలాంటి ఉపయోగం లేకుండా ఆన్‌లో ఉంచవద్దు. అది పని చేయకపోతే స్విచ్ ఆఫ్ చేయండి. దీని వల్ల బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవ్వకుండా ఉంటుంది.


మరోవైపు సెప్టెంబర్ రెండో యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ఐఫోన్ 15 ధర రూ.79,990 నుంచి ప్రారంభం అవుతుంది. స్మార్ట్‌ఫోన్ ప్రేమికులు ఈ సిరీస్‌ నుంచి ఏదో ఒక ప్రత్యేకతను ఆశించారు. కానీ ఐఫోన్ 15 సిరీస్‌లో ఆశించినంత కొత్తగా ఏమీ కనిపించలేదు. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 16లో ఆ లోటును కంపెనీ పూరించగలదని వార్తలు వస్తున్నాయి. నిజానికి వినియోగదారులు ఐఫోన్ 15లో 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ వస్తుందని ఆశించారు. కానీ కంపెనీ ఇందులో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను మాత్రమే అందించింది. రూ.80 వేల వరకు ఉన్న ధర వద్ద ఇది నిరాశే అని చెప్పవచ్చు.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial