అక్టోబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అయ్యాయి. మొదట అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు, తర్వాత అందరు వినియోగదారులకు ఈ సేల్స్‌ను ఈ-కామర్స్ దిగ్గజాలు ప్రారంభించాయి. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు వంటి పలు ఎలక్ట్రానిక్ పరికరాలపై కూడా సేల్‌లో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 మోడల్స్‌పై కూడా ఆఫర్లు అందించారు.
ఐఫోన్ 14పై ఆఫర్
ఐఫోన్ 14లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.56,999గా ఉంది. దీని అసలు ధర రూ.69,990 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీంతోపాటు అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి. కార్డు ఆఫర్లు అన్నీ కలిపితే రూ.51,999కే కొనుగోలు చేయవచ్చు. బ్లూ, మిడ్ నైట్, పర్పుల్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్, ఎల్లో కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 13పై ఆఫర్
ఐఫోన్ 13లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.48,999గా ఉంది. దీని అసలు ధర రూ.59,900 కాగా సేల్‌లో తగ్గించారు. మరోవైపు దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్లూ, గ్రీన్, మిడ్ నైట్, పింక్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్ ఆప్షన్లలో ఐఫోన్ 13 కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 12పై ఆఫర్లు
ఐఫోన్ 12 ధర లాంచ్ అయినప్పుడు దాని ధర రూ.79,900 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.40,999కే కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్లు కలుపుకుని రూ.37,499కే అందుబాటులో ఉండనుంది. బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ (రెడ్), పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ సేల్‌కు ఉంది.
వీటిలో ఏది కొనడం బెస్ట్?
ప్రస్తుతం జరుగుతున్న సేల్‌లో ఐఫోన్ 14 బేస్ మోడల్‌ను కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్. ఇందులో ముందు వెర్షన్ల కంటే మెరుగైన కెమెరా ఫీచర్లు ఉంటాయి. ఒకవేళ అంత బడ్జెట్ లేదు అనుకుంటే ఐఫోన్ 13 మీద కూడా ఒక లుక్కేయవచ్చు. కచ్చితంగా ఐఫోన్ కొనాలి అనుకుంటే అప్పుడు ఐఫోన్ 12ని ఆప్షన్‌గా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మరో రెండు, మూడేళ్లలో దీనికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు ఆగిపోతాయి.
మరోవైపు ఇండియాటుడే నివేదిక ప్రకారం యాపిల్ ఐఫోన్ 16 బేస్ మోడల్‌లలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించనుంది. ఇప్పటి వరకు కంపెనీ బేస్ మోడల్‌లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను మాత్రమే అందించింది. ఐఫోన్ 16 ప్రోలో 6.3 అంగుళాల డిస్‌ప్లేను, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్‌ప్లే యాపిల్ అందించనుందని తెలుస్తోంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌ల్లో 6.1, 6.7 అంగుళాల డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial