5G Smartphone: మీరు 2023లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, కచ్చితంగా 5జీ స్మార్ట్‌ఫోన్‌నే కొనుగోలు చేయాలి. ఎందుకంటే మరికొద్ది కాలంలోనే 5జీ నెట్‌వర్క్ దేశం అంతా రోల్అవుట్ అవుతుంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌లు చాలా ఖరీదైనవి అని మీరు అనుకుంటే, పప్పులో కాలేసినట్లే.


ఎందుకంటే ఇప్పుడు రూ. 15,000 రేంజ్‌లో కూడా 5జీ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో శాంసంగ్, షియోమీ, ఐకూ వంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


రెడ్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్
ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, ఇది 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. రెడ్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పవర్ కోసం ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్‌ఫోన్
ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.13,990గా ఉంది. ఈ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. శాంసంగ్ సొంత ఎక్సినోస్ 1330 చిప్‌సెట్‌తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీలో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ పవర్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, దీనితో పాటు కంపెనీ రెండు సంవత్సరాల OS అప్‌డేట్స్‌ను, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ వారంటీని ఇచ్చింది.


ఐకూ జెడ్6 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్
ఈ ఐకూ ఫోన్ ధర రూ.14,499గా ఉంది. ఐకూ జెడ్6 లైట్ 5జీ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కూడా అందించారు. ఐకూ జెడ్6 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో లాంచ్ అయింది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.


మరోవైపు హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ ఆఫర్‌ను అందించారు. ఏకంగా రూ.11 వేల తగ్గింపును హానర్ అందించింది. ఈ ఫోన్‌ను రూ.26,999కే ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial