Top 5 Smartphone Brands: ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ నివేదిక ప్రకారం భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2022 మూడో త్రైమాసికంతో (జులై నుంచి సెప్టెంబర్ మధ్య) పోలిస్తే 2023 మూడో త్రైమాసికంలో మూడు శాతం క్షీణించింది. ఈసారి మూడో త్రైమాసికంలో 4.7 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు పోయాయి. ఇందులో శాంసంగ్ అగ్రస్థానంలో ఉంది.
కొరియన్ కంపెనీ శాంసంగ్ 79 లక్షల యూనిట్లను షిప్పింగ్ చేసింది. దీని ద్వారా 2023 మూడో త్రైమాసికంలో 18 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనీస్ బ్రాండ్ షావోమీ 76 లక్షల షిప్‌మెంట్‌లతో ఉంది. చవకైన 5జీ ఫోన్‌లను విడుదల చేయడం ద్వారా భారతీయ మార్కెట్లో షావోమి మంచి వాటాను సాధించింది.
టాప్-5లో నాలుగు చైనా కంపెనీలు
వివో 72 లక్షల యూనిట్ షిప్‌మెంట్‌లతో మూడో స్థానంలో ఉండగా, రియల్‌మీ 58 లక్షల యూనిట్లతో నాలుగో స్థానంలోనూ, ఒప్పో 44 లక్షల యూనిట్ షిప్‌మెంట్‌లతో ఐదో స్థానాల్లోనూ నిలిచాయని కెనాలిస్ నివేదిక తెలిపింది. ఫెస్టివల్ సేల్ సందర్భంగా అన్ని బ్రాండ్‌లు బడ్జెట్ 5జీ ఫోన్‌లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయని, దీని కారణంగా వాటి మార్కెట్ షేర్ బాగానే ఉందని కెనాలిస్ సీనియర్ అనలిస్ట్ సన్యామ్ చౌరాసియా తెలిపారు.
రెడ్‌మీ 12 5జీ, పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడం ద్వారా ఆయా బ్రాండ్లు ప్రజలను ఆకర్షించాయి. అదేవిధంగా రియల్‌మీ 11ఎక్స్ 5జీ, రియల్‌మీ 11 5జీలను మార్కెట్లో ప్రవేశపెట్టడం ద్వారా రియల్‌మీ కూడా ప్రజలకు చవకైన ఫోన్ ఆప్షన్లను అందించింది. ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు కూడా బాగా అమ్ముడయ్యాయి. పండుగ సేల్‌లో ప్రజలు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్, ఐఫోన్ 14, ఐఫోన్ 13లను ఎక్కువగా కొనుగోలు చేశారు.
మార్కెట్ స్వల్పంగా వృద్ధిని కనబరిచినప్పటికీ టాప్ ఐదు బ్రాండ్ల షిప్‌మెంట్లు గతేడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయని కెనాలిస్ సీనియర్ విశ్లేషకుడు సన్యామ్ చౌరాసియా తెలిపారు. టాప్-5 కంపెనీలు కాకుండా మోటొరోలా, వన్‌ప్లస్, టెక్నో మొదలైన ఇతర బ్రాండ్లు మంచి పనితీరును కనబరిచాయి.
మరోవైపు మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లో పెద్ద మార్పు చేసింది. దీని తర్వాత వాట్సాప్‌ను ఉపయోగించడానికి ఇకపై రెండు చేతులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం ఒక చేత్తోనే ఆపరేట్ చేయవచ్చు. ఎంతో టెస్టింగ్ తర్వాత వాట్సాప్ ఇప్పుడు కొత్త ఇంటర్‌ఫేస్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ని ఒక చేత్తో ఉపయోగించవచ్చు. వాట్సాప్ రూపొందిస్తున్న ఈ ఇంటర్‌ఫేస్ ఇప్పటి వరకు టెస్టింగ్‌లో ఉంది. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial