మోటో జీ14 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఆగస్టు 1వ తేదీన లాంచ్ కానుంది. లాంచ్‌కు ముంగిట దీని ధర ఆన్‌లైన్‌లో లీక్ అయింది. మోటో జీ14 ల్యాండింగ్ పేజీ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాండ్ అయింది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. యూనిసోక్ టీ616 ప్రాసెసర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది.  మోటో జీ13కు తర్వాతి వెర్షన్‌గా మోటో జీ14 రానుంది.


ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ దీని ధరను లీక్ చేశారు. దీని ధర రూ.10 వేల నుంచి రూ.11 వేల మధ్యలో ఉండనున్నట్లు తెలుస్తోంది. మోటో జీ13 స్మార్ట్ ఫోన్ మనదేశంలో రూ.9,999 ధరతో లాంచ్ అయింది. ఈ వారం ప్రారంభంలోనే మోటో జీ14 మనదేశంలో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ దీనికి సంబంధించిన మైక్రోసైట్‌ను కూడా లాంచ్ చేసింది.


మోటో జీ14 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై మోటో జీ14 పని చేయనుంది. ఆండ్రాయిడ్ 14కు అప్‌గ్రేడ్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను కంపెనీ అందించనుంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉండనుంది. ప్రాసెసింగ్ కోసం యూనిసోక్ టీ616 ప్రాసెసర్ కూడా అందించనున్నారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. ఆన్ బోర్డ్ స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.


మోటో జీ14 స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు ఐపీ52 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా అందించారు. ఆథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 20W టర్బోపవర్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 34 గంటల టాక్ టైం, 94 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం, 16 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైం లభించనుంది. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉన్న స్టీరియో స్పీకర్లు కూడా ఉండనున్నాయి. 










Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial