Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

ఐటెల్ పీ55 స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.

Continues below advertisement

ఐటెల్ పీ55 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. ఆక్టాకోర్ డైమెన్సిటీ ప్రాసెసర్, వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఐటెల్ పీ55లో ఉన్నాయి. ఏఐ పవర్డ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇందులో వెనకవైపు అందించారు. ఒక స్టోరేజ్ వేరియంట్, రెండు కలర్ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌పై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీని అందించనుంది.

Continues below advertisement

ఐటెల్ పీ55 ధర, ఆఫర్లు
బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఐటెల్ పీ55 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.999 తగ్గింపు లభించనుంది. అంటే రూ.తొమ్మిది వేలకే దీన్ని కొనుగోలు చేయవచ్చన్న మాట.

ఐపీల్ పీ55 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా...
ఐపీల్ పీ55లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. డ్యూయల్ నానో సిమ్ కార్డులను సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై ఐటెల్ పీ55 పని చేయనుంది.

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్‌ను కంపెనీ డెలివరీ చేయనుంది. ఎలాంటి యూజర్ ఇంటర్‌ఫేస్ ఇందులో లేదు కాబట్టి యాడ్స్ బెడద పెద్దగా ఉండదనే అనుకోవాలి.

కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. సెకండరీ ఏఐ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఐటెల్ పీ55లో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.

సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఇందులో చూడవచ్చు. ఐటెల్ పీ55 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీలు కూడా ఇందులో ఉన్నాయి. మనదేశంలో బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు విక్రయించడంలో ఐటెల్ కంపెనీ ముందు ఉంటుంది. ఐటెల్ ఎస్23 ప్లస్ అనే స్మార్ట్ ఫోన్‌ను కూడా రూ.14 వేలలోపు ధరతోనే కంపెనీ లాంచ్ చేసింది.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement