ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ రీసెంట్ గా ‘వాట్సాప్ ఛానెల్స్’ అనే  ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  భారత్ సహా పలు దేశాల్లో ఈ ఫీచర్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా నచ్చిన వారిని ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి ఫోన్ నెంబర్ లేకుండానే వారి అప్ డేట్స్ తెలుసుకోవచ్చు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ‘వాట్సాప్ ఛానెల్స్’ క్రియేట్ చేసుకుని అప్ డేట్స్ షేర్ చేస్తున్నారు. యూజర్లు ఈ ఛానెల్స్ ను ఫాలో అయితే సదరు వ్యక్తులు లేదంటే సంస్థల అప్ డేట్స్ చూసే అవకాశం ఉంటుంది.    


వాట్సాప్ ఛానెల్స్ చిరాకు పెడుతున్నాయా?


తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ‘వాట్సాప్ ఛానెల్స్’ ఫీచర్ కొంత మందికి చిరాకు కలిగిస్తోంది. పలువురు సోషల్ మీడియా వేదికగా ఈ ఫీచర్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ ఫీచర్ కారణంగా అసౌకర్యం కలుగుతుంది అంటున్నారు.  అలాంటి వారి కోసం వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ‘వాట్సాప్ ఛానెల్స్’ ద్వారా ఇబ్బంది పడుతున్నట్లు ఫీల్ అవుతున్నారో, వారు సదరు ఫీచర్ ను హైడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.  ఇంకా వాట్సాప్ ను అప్‌డేట్ చేయకుంటే, ఛానెల్స్ ఫీచర్ లేకుండా వాట్సాప్ పాత వెర్షన్‌ని కొనసాగించే అవకాశం ఉంటుంది. Androidలో ఇప్పటికే యాప్‌ను అప్‌డేట్ చేసి ఉంటే, చాట్స్ ను బ్యాకప్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయవచ్చు. అదే స్థానంలో పాత వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. లేదూ, మీరు వాట్సాప్  పాత వెర్షన్‌ని మళ్లీ ఇన్‌స్టాల్ చేయకూడదు అనునుకుంటే, ఛానెల్స్ ను హైడ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. అయితే, ఈ ఛానెల్స్ కేవలం వాట్సాప్‌లోని అప్‌డేట్‌ల ట్యాబ్‌లో హైడ్ చేస్తుందని గుర్తుంచుకోవాలి.


‘వాట్సాప్ ఛానెల్స్’ను ఎలా హైడ్  చేయాలంటే?  


‘వాట్సాప్ ఛానెల్స్’ ఫీచర్ ను ఎలా హైడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వాట్సాప్ యాప్ ను తెరవాలి. అప్ డేట్స్ మీద క్లిక్ చేయాలి. వ్యూ అప్ డేట్స్ మీద క్లిక్ చేయాలి. వెంటనే వాట్సాప్ ఛానెల్స్ ను పేజి కిందికి తీసుకెళ్తుంది. మీకు వాట్సాప్ లో  స్టేటస్ అప్ డేట్స్ ఉంటే, వాట్సాప్ ఛానెల్స్ హైడ్ అవుతాయి. అయితే, వాట్సాప్ క్లోజ్ చేసిన తర్వాత మళ్లీ యథావిధిగా ఛానెల్స్ అందుబాటులోకి వస్తాయి. ఛానెల్స్ ను హైడ్ చేసేందుకు వాట్సాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి  సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది.  ఈ పద్దతి చాలా తలనొప్పిగానే ఉందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. వాట్సాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఈ పద్దతి పాటించకుండా శాశ్వతంగా వాట్సాప్ ఛానెల్స్ ను హైడ్ చేసే ఫీచర్ ను తీసుకువస్తే బాగుంటుంది అంటున్నారు.


Read Also: వాట్సాప్‌లో ఎక్కువ అవుతున్న మోసాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే డేటా సేఫ్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial