హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. హానర్ 90 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ వెనక వైపు 200 మెగాపిక్సెల్, ముందు వైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను అందించారు. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.


హానర్ 90 5జీ ధర, ఆఫర్లు
ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా ఉంది. కానీ ఎర్లీ బర్డ్ సేల్ కింద హానర్ 90 5జీని రూ.27,999కే కొనుగోలు చేయవచ్చు. ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా నిర్ణయించారు. ఎర్లీ బర్డ్ సేల్ కింద ఈ ఫోన్‌ను రూ.29,999కే కొనుగోలు చేయవచ్చు.


అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్ సైట్లలో హానర్ 90 5జీ అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఎక్స్‌ఛేంజ్‌పై రూ.2,000 అదనపు తగ్గింపు లభించనుంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 డిస్కౌంట్ అందించనున్నారు. డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


హానర్ 90 5జీ స్పెసిఫికేషన్లు
హానర్ 90 5జీలో 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ మొబైల్ స్క్రీన్ రిజల్యూషన్ 1.5కే పిక్సెల్స్‌గా ఉండగా, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, పీక్ బ్రైట్‌నెస్ 1600 నిట్స్‌గానూ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ 90 5జీ పని చేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.


కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.1 ఆపరేటింగ్ సిస్టంపై హానర్ 90 5జీ పని చేయనుంది.


ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు. హానర్ 90 5జీ మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 183 గ్రాములుగా ఉంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial