iPhone 15: కొత్త ఐఫోన్లు కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - ఏకంగా నవంబర్ వరకు!

ఐఫోన్ 15 ప్రో సిరీస్ డెలివరీలు మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.

Continues below advertisement

యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ సేల్ కొన్ని దేశాల్లో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. చైనా, జపాన్, అమెరికా దేశాల్లో ఈ ఫోన్ చేతికి రావాలంటే నవంబర్ వరకు వెయిట్ చేయక తప్పేలా లేదు. శుక్రవారం ప్రారంభం అయిన ప్రీ-ఆర్డర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని కారణంగా కొత్త ఐఫోన్ల డెలివరీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Continues below advertisement

ఈ నాలుగు, ఐదు వారాల వెయిటింగ్ పీరియడ్... చైనాలో ఇతర బ్రాండ్లకు మేలు చేసేలా ఉంది. అయితే ఐఫోన్ 15 ప్రో కోసం కూడా కనీసం రెండు, మూడు వారాల వెయిటింగ్ పీరియడ్ ఉండనుందని తెలుస్తోంది. ఐఫోన్లకు టాప్ మార్కెట్ అయిన యునైటెడ్ స్టేట్స్‌లో కూడా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌కు ఆరు నుంచి ఏడు వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. జపాన్‌లో కూడా ఐదు నుంచి ఆరు వారాల వరకు ఉంది.

ఇక ఐఫోన్ 15 ప్రో విషయానికి వస్తే... చైనా తరహాలోనే యూఎస్, జపాన్‌ల్లో కూడా రెండు మూడు వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. డిస్‌ప్లేల విషయంలో కొరత కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ను యాపిల్ ఇటీవలే గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రో ధర మనదేశంలో రూ.1,34,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,44,900గానూ, 512 జీబీ వేరియంట్ ధరను రూ.1,64,900గానూ, 1 టీబీ వేరియంట్ ధరను రూ.1,84,900గానూ నిర్ణయించారు.

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర మనదేశంలో రూ.1,59,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ 128 జీబీ నుంచి కాకుండా 256 జీబీ నుంచి మొదలవుతుంది. ఇందులో 512 జీబీ వేరియంట్ ధరను రూ.1,79,900గానూ, 1 టీబీ వేరియంట్ ధరను రూ.1,99,900గానూ నిర్ణయించారు. బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్ మోడల్స్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.

ఇక ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ పీక్ బ్రైట్‌నెస్ట 2000 నిట్స్‌గా ఉంది. అదనపు ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా అందించారు. యాపిల్‌కు సంబంధించిన కొత్త 3ఎన్ఎం ఏ17 బయోనిక్ ప్రాసెసర్‌పై ఐఫోన్ 15 ప్రో సిరీస్ ఫోన్లు పని చేయనున్నాయి. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఈ సిరీస్‌లో ఉన్నాయి.

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement