Vivo V29 Series: మీరు కొత్త ఫోన్ కొనాలనుకుంటే అక్టోబర్ 4వ తేదీపై ఒక లుక్కేయాల్సిందే. ఎందుకంటే అదే రోజున ఐదు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. గూగుల్ తన కొత్త పిక్సెల్ సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. వివో వి29 సిరీస్‌ను విడుదల చేయనుంది. అదే విధంగా కొరియన్ కంపెనీ శాంసంగ్ కూడా గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. 


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయనుంది. ఇప్పటివరకు వచ్చిన లీక్‌ల ప్రకారం కంపెనీ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ల్లో లాంచ్ చేయవచ్చు. ఇందులో ప్రారంభ వేరియంట్ ధర రూ.54,999గానూ, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.59,999గానూ ఉండే అవకాశం ఉంది. ఇందులో మీరు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పంచ్ హోల్ డిస్‌ప్లేను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 లేదా ఎక్సినోస్ 2200 చిప్‌సెట్‌పై పని చేసే అవకాశం ఉంది.


ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్‌ చేసే 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు. బ్యాటరీ గురించి చెప్పాలంటే 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు.


గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ కూడా...
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌ను అక్టోబర్ 4వ తేదీన కంపెనీ విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ప్రారంభ మోడల్‌లో మీరు డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందుతారు. ప్రో మోడల్‌లో 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ ఉండనుంది. మొత్తంగా ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతారు. లీక్‌ల ప్రకారం ఈసారి ప్రో మోడల్ ధర 100 డాలర్లు ఎక్కువగా ఉండవచ్చు. భారతదేశంలో ఈ సిరీస్ ధర రూ. 65,000 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక టాప్ ఎండ్ ప్రో మోడల్ ధర దాదాపు రూ. 90,000 వరకు ఉండవచ్చు.


గూగుల్‌తో పాటు వివో కూడా ఈ రోజున వివో వీ29 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఇందులో మీరు వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందవచ్చు. కంపెనీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా మొబైల్ ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను లైవ్ చూడగలరు.


మొత్తంగా అక్టోబర్ 4వ తేదీన లాంచ్ అయ్యే ఫోన్లు...
1. వివో వీ29 (Vivo V29)
2. వివో వీ29 ప్రో (Vivo V29 Pro)
3. గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8)
4. గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro)
5. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE)


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial