Samsung Galaxy S23 FE: శాంసంగ్ తన మోస్ట్ అవైటెడ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ఎట్టకేలకు ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 4వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ తన అధికారిక ‘ఎక్స్/ట్విట్టర్’ పేజీలో పోస్ట్ చేసింది. అదే రోజున గూగుల్ తన రెండు స్మార్ట్‌ఫోన్‌లు పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోతో పాటు పిక్సెల్ వాచ్ సిరీస్‌ను కూడా లాంచ్ చేయనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫీచర్లు ఇలా...
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎక్సినోస్ చిప్ లేదా స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్‌సెట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే సపోర్ట్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్‌ను 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ల్లో దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది.


ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా,  8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉండనున్నాయి. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ధర ఎంత ఉండవచ్చు?
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో మూడు మోడల్స్ ఉన్నాయి. ఇందులో బేస్ మోడల్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ధర రూ.74,999 నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్‌ను రూ. 94,999 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక టాప్ మోడల్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ధర రూ.1,24,999గా నిర్ణయించారు. కంపెనీ టాప్ మోడల్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ధర రూ.60 వేలలోపు ఉండవచ్చు.


మరోవైపు శాంసంగ్ గెలాక్సీ రింగ్ మనదేశంలో 2024లో లాంచ్ కానుందని తెలుస్తోంది. తన గెలాక్సీ స్మార్ట్ వాచ్‌లను స్మార్ట్ రింగ్‌తో శాంసంగ్ మెల్లగా రీప్లేస్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. స్మార్ట్ వాచ్‌ల కంటే మరింత మెరుగ్గా ఈ రింగ్ పని చేస్తుందని సమాచారం. ఈ స్మార్ట్ డివైస్‌కు సంబంధించిన డిజైన్ రెండర్లు కూడా ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ రింగ్‌కు సంబంధించిన పేరును కూడా కంపెనీ ట్రేడ్ మార్క్ చేయించిందని తెలుస్తోంది. 2024 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్24 సిరీస్ మొబైల్స్‌తో పాటు ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయని  సమాచారం. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ దీనికి సంబంధించిన వివరాలను వీబో అనే చైనాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేశారు.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial