Charging iPhone 15 with android charger: ఐఫోన్ 15 సిరీస్ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈసారి కొత్త సిరీస్ యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్‌తో సహా అనేక మార్పులతో వచ్చింది. ఐఫోన్ 15 సిరీస్‌లో కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్లలో కనిపించే యూనివర్సల్ ఛార్జింగ్ పోర్ట్‌ను అందించింది. లైట్‌నింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ పొందిన తర్వాత, ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఛార్జర్‌తో కొత్త ఐఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చా లేదా అనేది చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న. చేయవచ్చు కానీ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
మీరు ఆండ్రాయిడ్ ఛార్జర్‌తో ఐఫోన్ 15 సిరీస్‌ని కూడా ఛార్జ్ చేయవచ్చు. అయితే మీ అడాప్టర్ లేదా కేబుల్ ఎంత వాటేజ్ అయినా, మీరు ఐఫోన్ 15, 15 ప్లస్‌లను 20W లేదా అంతకంటే తక్కువ వాటేజ్‌తో మాత్రమే ఛార్జ్ చేయగలరని గుర్తుంచుకోండి.
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం మీరు ఐఫోన్ 15, 15 ప్లస్‌లను 20W లేదా అంతకంటే తక్కువ వేగంతో మాత్రమే ఛార్జ్ చేయగలరు. అంటే 65W ఛార్జర్‌తో ఛార్జింగ్ పెట్టినా నిదానంగానే ఛార్జ్ అవుతుందన్న మాట. కంపెనీకి చెందిన పోర్టులే ఇందుకు కారణం. అదేవిధంగా మీరు ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను 27W నుంచి 29W వాట్ల వేగంతో ఛార్జ్ చేయగలరు. ప్రో మోడల్స్ బేస్ మోడల్స్ కంటే కొంచెం వేగంగా ఛార్జ్ అవుతాయి.
మీరు స్మార్ట్‌ఫోన్‌కు సూచించిన ఛార్జర్‌తో మాత్రమే ఛార్జ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే ఇది మీ బ్యాటరీ ఆరోగ్యాన్ని అలాగే ఉంచుతుంది. యాపిల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఐఫోన్ 15, 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లను 20W అడాప్టర్‌తో 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేయడానికి మీరు కంపెనీ నుంచి అధిక వాట్ అడాప్టర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15 సిరీస్‌లో ఎంత mAh బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి అనే సమాచారాన్ని యాపిల్ అధికారికంగా పంచుకోలేదు. అయితే ఒక ఛార్జ్‌పై ఎంత సేపు ఫోన్ పని చేస్తుందో కంపెనీ తెలిపింది. మీరు యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దీనికి సంబంధించిన సమాచారాన్ని చూడవచ్చు.
ఐఫోన్ 15, 15 ప్లస్ ధర ఇలా?
ఐఫోన్ 15 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రారంభ మోడల్ అయిన 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.89,900గా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,09,900గా ఉంది. ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ వేరియంట్ అయిన 128 జీబీ స్టోరేజ్ ధర రూ.89,900గా ఉంది. 256 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్ ధరను రూ.99,900గా నిర్ణయించారు. 512 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.1,19,900 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial