ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు మనదేశంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి ఆసక్తి గల వినియోగదారులు యాపిల్ రిటైల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు. దీంతోపాటు ముంబైలోని యాపిల్ బీకేసీ స్టోర్, ఢిల్లీలోని యాపిల్ సాకేత్ స్టోర్ల ముందు కూడా వినియోగదారులు బారులు తీరారు. డెలివరీ యాప్ ప్లాట్‌ఫాం బ్లింకిట్ ద్వారా ఐఫోన్ 15 సిరీస్‌ను కేవలం నిమిషాల్లోనే పొందవచ్చు.


యాపిల్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌లో సెప్టెంబర్ 12వ తేదీన ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2 ఇతర ఉత్పత్తులు కూడా మార్కెట్లోకి వచ్చాయి. యాపిల్, బ్లింకిట్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్లింకిట్ వ్యవస్థాపకుడు అల్బీందర్ ధిండ్సా అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్ ప్రకారం ఐఫోన్ 15 మోడల్స్ వినియోగదారులకు కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సేవలు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణే నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.ఐదు వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభించనుంది.






యాపిల్ స్టోర్‌లో డెలివరీ ఇలా?
యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో చూపిస్తున్న డెలివరీ టైమ్‌లైన్ ప్రకారం... ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లకు సంబంధించి ప్రారంభ వేరియంట్ల డెలివరీ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. టాప్ ఎండ్ స్టోరేజ్ వేరియంట్లు అక్టోబర్ నాలుగో తేదీ నుంచే డెలివరీ కానున్నాయి.


ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ మొబైల్స్ డెలివరీలు అక్టోబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు యాపిల్ స్టోర్‌లో పేర్కొన్నారు. నేచురల్ టైటానియం., వైట్ టైటానియం కలర్ వేరియంట్లకు సంబంధించిన డెలివరీలు నవంబర్ 7వ తేదీ నుంచి మొదలవుతాయి. ఆర్డర్ పెట్టిన నెలన్నర తర్వాత వీటి డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్న మాట.


ఐఫోన్ 15, 15 ప్లస్ ధ‌రలు
ఈ స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,900గానూ, 512 జీబీ స్టోరేజ్ ధరను రూ.1,09,900గా నిర్ణయించారు. కొన్ని బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్ కూడా లభించనుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ మోడల్ అయిన 128 జీబీ స్టోరేజ్ ధర మనదేశంలో రూ.89,900గా ఉంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.99,900గానూ, 512 జీబీ స్టోరేజ్ మోడల్‌ ధరను రూ.1,19,900గానూ నిర్ణయించారు.


Read Also: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!


Read Also: ట్విటర్ యూజర్లకు షాక్ ఇవ్వనున్న మస్క్, అందరూ డబ్బు కట్టాల్సిందే ! 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial