టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ (Tecno Phantom V Flip) స్మార్ట్ ఫోన్ మనదేశంలో శుక్రవారం లాంచ్ అయింది. కంపెనీ మనదేశంలో లాంచ్ చేసిన రెండో ఫోల్డబుల్ ఫోన్ ఇదే. 2023 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్లో టెక్నో ఫాంటం వీ ఫోల్డ్‌ను కంపెనీ లాంచ్ చేసింది. క్లామ్‌షెల్ ఫోల్డబుల్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెండు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన ఫ్లిప్ ఫోన్ (Cheapest Flip Phone in India) కూడా ఇదే.


టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ ధర (Tecno Phantom V Flip Price)
ఐకానిక్ బ్లాక్, మిస్టిక్ డాన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. కేవలం 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. దీని ధరను రూ.49,999గా నిర్ణయించారు. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. పలు బ్యాంకు ఆఫర్లు కూడా దీనిపై అందించనున్నారు. 


టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Tecno Phantom V Flip Specifications, Features)
ఇందులో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ ఇన్నర్ డిస్‌ప్లేను అందించారు. దీని బ్రైట్‌నెస్ లెవల్ 1000 నిట్స్ వరకు ఉంది. బయటవైపు 1.32 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఉంది. వినియోగదారులు తమ మెసేజ్‌లకు కవర్ స్క్రీన్ నుంచే రిప్లై ఇవ్వచ్చు.


మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ అందుబాటులో ఉంది. 16 జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకునే అవకాశం ఉంది. 256 జీబీ యూఎస్‌బీ 3.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీలో అందించారు. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్లు కూడా కంపెనీ అందించనుంది.


ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు వైడ్ యాంగిల్ లెన్స్ కూడా లభించనున్నాయి. దీంతో పాటు క్వాడ్ ఫ్లాష్ యూనిట్ కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.


5జీ, వైఫై 6, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ కాగా, 45W వైర్డ్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.69 సెంటీమీటర్లు మాత్రమే. కానీ ఫోల్డ్ చేసినప్పుడు 1.49 సెంటీమీటర్లు ఉండనుంది.


Read Also: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!


Read Also: ట్విటర్ యూజర్లకు షాక్ ఇవ్వనున్న మస్క్, అందరూ డబ్బు కట్టాల్సిందే ! 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial