5G Phones under 15000: భారతదేశంలో చవకైన స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ ఎల్లప్పుడూ బాగానే ఉంటుంది. నేటికీ ప్రజలు రూ.10 వేల నుంచి రూ.20,000 మధ్య ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఫెస్టివల్ సేల్‌లో ప్రజలు రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ధర ఉన్న 5జీ ఫోన్లను కొనుగోలు చేశారు. రెడ్‌మీ, శాంసంగ్, వివో ఇతర బ్రాండ్లు ఈ ధరల విభాగంలో చవకైన 5జీ ఫోన్లను లాంచ్ చేశాయి. తక్కువ ధరకు కొత్త ఫోన్‌కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందించాయి. మీరు కొత్త 5జీ ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, కొన్ని మంచి ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.
చవకైన ధరలో ఉండే 5జీ ఫోన్లు ఇవే...
రెడ్‌మీ 12 5జీ: ఈ ఫోన్ ధర రూ. 11,999గా ఉంది. ఇందులో మీరు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 4 జెన్2 2 చిప్‌సెట్‌లను పొందుతారు. చాలా తక్కువ ధరలో మంచి కెమెరా, బలమైన బ్యాటరీ, మంచి పనితీరును కోరుకునే వారికి ఈ ఫోన్ మంచిది.
మోటొరోలా జీ54 5జీ: ఈ ఫోన్ క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి మంచిది. దీనిలో మీరు 6000 ఎంఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13, 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ కెమెరా, డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌ని అందిస్తారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.13,999గా ఉంది.
పోకో ఎం6 ప్రో 5జీ: ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు దాదాపు రెడ్‌మీ 12 5జీ లాగా ఉన్నాయి. దీనిలో మీరు 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ సపోర్ట్‌ను పొందుతారు. అయితే ఈ ఫోన్ ధర రెడ్‌మీ 12 5జీ ఫోన్ కంటే తక్కువే. దీన్ని రూ. 10,999కి కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ: మీరు ఈ ఫోన్‌ను అమెజాన్ నుంచి రూ. 12,249కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీరు 33W ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
ఐకూ జెడ్6 లైట్ 5జీ: ఇది కూడా మంచి ఫోన్. దీనిలో మీరు 6.68 అంగుళాల డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా పొందుతారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.13,495గా ఉంది.
మరోవైపు వివో ఎక్స్90 ప్రో స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్‌ను అందించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 512 జీబీ వరకు స్టోరేజ్ ఈ మొబైల్‌లో అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మనదేశంలో రూ.84,999 ధరతో మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధరను రూ.10 వేలు తగ్గించి రూ.74,999కు తగ్గించారు. ఒరిజినల్ బ్లాక్ షేడ్ కలర్ ఆప్షన్‌లో వివో ఎక్స్90 ప్రోను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial