ఎంఐయూఐ 13 అప్‌డేట్ డిసెంబర్ 28వ తేదీన లాంచ్ కానుంది. షియోమీ 12 సిరీస్ ఫోన్లతో పాటు ఈ అప్‌డేట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. ఇంతకుముందు ఉన్న ఎంఐయూఐ 12.5 కంటే వేగవంతమైన పెర్ఫార్మెన్స్‌ను ఈ ప్రాసెసర్ అందించనుంది. షియోమీ 12, షియోమీ 12 ప్రో స్మార్ట్ ఫోన్లలో ఇది ప్రీ-ఇన్‌స్టాల్ అయి రానుంది. ఎంఐ మిక్స్ 4, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, రెడ్‌మీ కే40 సిరీస్‌కు ఈ అప్‌డేట్ త్వరలో రానుంది.
ఎంఐయూఐ 13 లాంచ్ తేదీని షియోమీ వీబోలో ప్రకటించింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు (మనదేశ కాలమానం ప్రకారం) ఈ అప్‌డేట్ రానుంది. ఎంఐయూఐ 12.5తో పోలిస్తే సిస్టం యాప్స్ 20 నుంచి 26 శాతం వరకు, థర్డ్ పార్టీ యాప్స్ 15 నుంచి 52 శాతం వరకు మెరుగ్గా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది.
ప్రైవసీ సెక్యూరిటీ గోల్ కీపర్ అనే ప్రత్యేకమైన ప్రైవసీ ఫీచర్ కూడా ఇందులో ఉండనుందని కంపెనీ పేర్కొంది. దాదాపు 3 వేలకు పైగా యాప్స్ ఫుల్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నాయి. దీంతోపాటు ఎన్నో ఇంటర్ ఫేస్ లెవల్ చేంజెస్ కూడా ఇందులో చేశారు. కొత్త థీమ్స్, వాల్ పేపర్లు, ఐకాన్లు కూడా ఇందులో అందించారు.
దీంతోపాటు షియోమీ గత వెర్షన్‌లో ఉన్న కొన్ని లోపాలను సరిచేసి ఇందులో కొత్తగా అందించే అవకాశం ఉంది. అప్‌డేటెడ్ మల్టీటాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ల కోసం ఎంఐయూఐ 13తో పాటు కొత్తగా ఎంఐయూఐ 13 ప్యాడ్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది.
ఎంఐ మిక్స్ 4, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11, షియోమీ 11 లైట్ 5జీ, ఎంఐ 10ఎస్, రెడ్‌మీ కే40 ప్రో ప్లస్, రెడ్‌మీ కే40 ప్రో, రెడ్‌మీ కే40 గేమింగ్ ఎడిషన్, రెడ్‌మీ కే40, రెడ్‌మీ నోట్ 10 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లకు కంపెనీ ఈ అప్‌డేట్‌ను అందించనుందని తెలుస్తోంది.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?