Laptop Battery Issues: ల్యాప్‌టాప్‌ల వాడకం బాగా పెరిగిపోయింది. అయితే చాలా మందికి ల్యాప్‌ట్యాప్‌లు బ్యాటరీ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఛార్జింగ్ పెట్టిన కాసేపటికే బ్యాటరీ డ్రైన్ అయిపోతుంటాయి. పని తక్కువ చేసినప్పటికీ ఎందుకు ఇలా అవుతుందో కొందరికి తెలియకపోవచ్చు. అలాంటి విషయాలను మీ కోసం ఇక్కడ షేర్ చేస్తున్నాం. 


బ్రైట్‌నెస్‌
ల్యాప్‌టాప్ బ్యాటరీలు త్వరగా డిశ్చార్జ్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు అందులో మొదటిది బ్రైట్‌నెస్‌. చాలా మంది ఈ విషయం గురించి అసలు పట్టించుకోరు. నార్మల్‌గానే ల్యాప్‌టాప్‌ను యూజ్ చేస్తుంటారు. ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌ రావాలంటే మాత్రం ఈ బ్రైట్‌నెస్‌పై కన్నేసి ఉంచాలి. ల్యాప్‌టాప్‌కు ఉండే ఎల్‌సీడీ స్క్రీన్‌ను బ్రైట్‌గా చేయడానికి చాలా పవర్ కావాల్సి ఉంటుంది. 


ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే... కొన్ని ల్యాప్‌టాప్‌లు ఎల్‌సీడీలు వాడుతుంటే మరికొన్ని ఓఎల్‌ఈడీ స్క్రీన్‌లు వాడుతున్నారు. వీటిలో ఎల్‌సీడీలు కంటెంట్‌తో సంబంధం లేకుండా బ్రైట్‌నెస్‌ ఒకేలా ఉంటుంది. ఓఎల్‌ఈడీ స్క్రీన్‌లు కలిగి ఉన్న ల్యాప్‌టాప్‌లు మాత్రం విజువల్స్‌ కంటెంట్‌ను బట్టి బ్రైట్‌నెస్‌ మారుతూ ఉంటుంది.  


మీరు ఎంత బ్రైట్‌నెస్‌ పెంచుకుంటే అంత త్వరగా బ్యాటరీ పవర్ ఖర్చు అవుతుంది. అందుకే మీ కంటికి ఇబ్బంది లేకుండా ఉండేలా తక్కువ బ్రైట్‌నెస్‌లో పని చేసుకుంటే మంచిదని ల్యాప్‌టాప్‌ బ్యాటరీకి ఎక్కువ లైఫ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 


మీరు పని చేసే వాతావరణం 


మీరు పని చేసే వాతావరణం కూడా మీ ల్యాప్‌టాప్ బ్యాటరీని కరిగించేస్తాయి. మీరు ఎక్కువ లైటింగ్‌లో పని చేస్తున్న సమయంలో ఎక్కువ బ్రైట్‌నెస్ అవసరం అవుతుంది. అలాగే డార్క్‌ ఏరియాలో పని చేస్తుంటే తక్కువ బ్యాటరీతో పని అయిపోతుంది. దీని వల్ల తక్కువ బ్యాటరీ శక్తి వినియోగించుకోవచ్చు. అందుకే మీరు వీలైనంత తక్కవ లైటింగ్‌లో పని చేసుకోవడానికి ప్రయత్నించండి. 


Also Read: న్యూ ఫీచర్స్​తో యూట్యూబ్.. ఈ మార్పులు, చేర్పుల గురించి తెలుసా? కేవలం వారికి మాత్రమేనా?


గేమింగ్స్‌ 
ఒకేసారి మీరు మల్టీటాస్కింగ్ చేస్తే మీ శక్తి ఎక్కువగా ఖర్చు అవుతుంది. అదే ఇక్కడ ల్యాప్‌టాప్‌కి కూడా అప్లై అవుతుంది. చిన్న చిన్న వర్క్‌లు చేసినప్పుడు పెద్దగా సమస్య ఉండదు కానీ... ల్యాప్‌టాప్‌లో గేమ్స్ ఆడితే మాత్రం పవర్‌ త్వరగా డ్రై అవుతుంది. ల్యాప్‌టాప్‌లో గేమ్స్ అడితే సీపీయూ, జీపీయూ, కూలింగ్‌ సిస్టమ్‌, అన్ని వ్యవస్థలు ఒకేసారి పని చేస్తాయి. అందుకే చాలా త్వరగా బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. 



GPUలతో కూడిన గేమింగ్ ల్యాప్‌టాప్‌లు గరిష్టంగా 150 వాట్ల వరకు విద్యుత్‌ ఛార్జింగ్ తీసుకుంటాయి. అలాంటి టైంలో ల్యాప్‌టాప్‌లు గంట ఛార్జింగ్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఆన్‌లైన్ గేమ్స్‌ ఆడితే విద్యుత్ వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. 


వీడియోలు 
సినిమాలు, వీడియోలు చూడటం వల్ల బ్యాటరీపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ వీడియోలు చూడటం కూడా బ్యాటరీ బ్యాకప్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ వీడియోలు చూసినప్పుడు ఎక్కువ బ్యాటరీ ఖర్చు అవుతుంది. ఆఫ్‌లైన్ వీడియోలకు అయ్యే బ్యాటరీ తక్కువగా ఉంటుంది. ఆన్లైన్ స్ట్రీమింగ్ వీడియోలకు అయితే Wi-Fi వినియోగం, BOH కారణంగా ఎక్కువ పవర్‌ ఖర్చు అవుతుంది. మీరు ఆన్‌లైన్‌లో చూసే వీడియో క్వాలిటీ కూడా బ్యాటరీ బ్యాకప్‌పై ఎఫెక్ట్‌ పడుతుంది.


Also Read: పబ్లిక్ డే విషెస్ ను కొత్తగా చెప్పాలనుకుంటున్నారా.. మీ ఫొటోనే వాట్సాప్ స్టిక్కర్‌గా క్రియేట్ చేసి సెండ్ చేయండిలా.